SIP Investors: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా మంది పెట్టుబడిదారులు తమ డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో పార్క్ చేయటం ద్వారా ర్యాలీ లాభాలను క్యాష్ చేసుకోవాలని గత ఏడాది కాలం నుంచి రాబడిని పొందారు. ప్రధానంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ ఇన్వెస్టర్లు మంచి లాభాలను అందుకున్నారు. కానీ ఇప్పుడు మార్కెట్లలో ఒడిదొడుకుల కారణంగా పెట్టుబడిదారులు ప్రస్తుతం ఈక్విటీలతో పాటు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు దూరంగా జరుగుతున్నారు.
కొన్ని నెలల కిందట మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు స్టాక్స్ పతనంలో ఉండగా బై ఎట్ డిప్స్ ఫార్ములాను ఉపయోగించి ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను పొందేందుకు ప్రయత్నించారు. అయితే వారాలు గడుస్తున్నప్పటికీ ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న కరెక్షన్ కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లకు దూరంగా జరుగుతున్నారు. భారతీయ స్టాక్ మార్కెట్ గత ఒక నెల నుంచి భారీ క్షీణతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపుల తరువాత విదేశీ పెట్టుబడిదారులు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరపడం మార్కెట్ అస్థిరతకు కారణమైంది. విదేశీ పెట్టుబడిదారుల మద్దతు లేకపోవడం వల్ల మార్కెట్లు మందగించాయి.

దలాల్ స్ట్రీట్ నష్టాలతో ఎరుపెక్కటంతో పెట్టుబడిదారులు లక్షల కోట్ల రూపాయల విలువైన తమ సంపదను కోల్పోయారు. ఇదే సమయంలో 61 లక్షల మంది తమ SIPలను మూసివేసినట్లు వెల్లడైంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కంటే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం సురక్షితమని నిపుణులు తరచుగా చెప్పినప్పటికీ చాలా మంది ఇన్వెస్టర్లు గందరగోళ పరిస్థితులతో తమ సిప్స్ క్యాన్సిల్ చేశారు. కానీ ఈ మార్కెట్ క్షీణత మ్యూచువల్ ఫండ్లపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారులు మార్కెట్‌ను మలుపు తిప్పారు.
జనవరి 2025లో SIP నిలిపివేస్తున్న ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పెరిగింది. SIP మూసివేతల సంఖ్య 82.73%కి చేరుకోవటంతో మ్యూచువల్ ఫండ్స్ కళ తప్పుతున్నాయి. జనవరిలో SIPలను మూసివేసిన వారి సంఖ్య 61.33 లక్షలకు చేరుకుంది. డిసెంబర్‌లో ఈ సంఖ్య 44.90 లక్షలుగా ఉంది. మాంద్యం సమయంలో పెట్టుబడి పెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వాటి ఫలితాలు దీర్ఘకాలంలో పొందవచ్చని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో రాధిక గుప్తా అన్నారు. మార్కెట్ తిరోగమనాల సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడి వస్తుందని చరిత్ర నిరూపించిన విషయాన్ని ఆమె ప్రస్థావించారు. ఈ సమయంలో తక్కువ ధరకు యూనిట్లను కొనుగోలు చేయటాన్ని ఇన్వెస్టర్లు మిస్ అవుతున్నారని ఆమె అన్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications