బెంగుళూరుని మించి పెట్టుబడుల రేస్‌లో ఆంధ్రప్రదేశ్ నిజంగా ముందుంటదా?
ముంబైలోని CII ఇన్వెస్టర్స్ ఈవెంట్‌లో NDTVతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు, IT మంత్రి నారా లోకేష్ రాష్ట్రం ఇప్పుడు భారత్‌లో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన స్థలంగా మారుతోంది. లోకేష్ చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే $120 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించిందని ఆయన తెలిపారు. వ్యవసాయం, డ్రోన్లు, ఆటోమోటివ్, డీప్ టెక్, GCC భాగస్వామ్యాలు వంటి రంగాల పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అదనంగా అమరావతిలో "క్వాంటం కంప్యూటర్ సెంటర్" ఏర్పాటు చేసే ప్రణాళిక కూడా ఉంది.
లోకేష్ వివరించినట్టు, ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద రాష్ట్రం మరియు దేశంలో రెండవ పొడవైన తీరంతో కలిగి ఉంది. అందుకే రాష్ట్రం, కేంద్రం మరియు స్థానిక అభిప్రాయాలను కలిపి ప్రాంతాల వారీగా, స్థిరంగా అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.

రాష్ట్రంలో ఇటీవల చాలా పెద్ద మార్పులు అవుతున్నాయి. లేబర్ చట్టాలు, విద్యుత్ రంగ నియంత్రణలు, పౌర సేవల అందించే విధానాలు అన్నీ సవరించారు. ముఖ్యంగా ప్రజలకు సేవలు సులభంగా అందించడానికి ఒక WhatsApp నంబర్ ద్వారా అనేక ప్రభుత్వ సేవలను పొందే అవకాశం కల్పించారు. లోకేష్ వివరించినట్టు, ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం వ్యవస్థలో ఉన్న అడ్డంకులను తగ్గించడం. వ్యాపారాలు త్వరగా ముందుకు సాగడానికి అనుకూల వాతావరణం కల్పించడం. ఇలా చేయడం ద్వారా పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా సవరణలు చేయడంతో, కర్ణాటక రాష్ట్రంతో కొన్ని వివాదాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రియాంక ఖర్గే మరియు ఇతర నేతలతో బహిరంగంగా మాటల యుద్ధం జరిగింది. ఇందుకు కారణం రెండు రాష్ట్రాలు ఒకే పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీపడటం. అయితే లోకేష్ ఈ పరిస్థితిని ప్రతికూలంగా కాకుండా, "ఆరోగ్యకరమైన పోటీతో కూడిన ఫెడరలిజం" అని పేర్కొన్నారు, అంటే రాష్ట్రాల మధ్య ఉన్న ఈ పోటీ దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని ఆయన భావించారు.
లోకేష్ చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలవడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది ప్రభుత్వ నిర్వహణలో నైపుణ్యం, అంటే పనులను సక్రమంగా, ప్రొఫెషనల్‌గా నిర్వహించడం. రెండవది తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడం. మూడవది పరిశ్రమలను ఒక చోట కేంద్రీకరించి క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం. ఈ మూడు అంశాలే రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నాయని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా లోకేష్ ప్రస్తావించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశంలో రాష్ట్రం ముందంజలో ఉండాలన్న తీరును సూచించారని కేంద్రంతో సంబంధం పరస్పర లాభదాయకమని అవసరమైన మద్దతు అందుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన సవరణలు పెట్టుబడి ప్రోత్సాహం, పరిశ్రమల క్లస్టర్ విధానం ద్వారా దేశంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాష్ట్రంగా మారుతోంది. కర్ణాటకతో కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ, రాష్ట్రం వేగం మరియు సమర్ధతను కొనసాగిస్తూ పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగిస్తుంది.


Click it and Unblock the Notifications