Karnataka Vs Telangana: అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రెండు చోట్లా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే. అయితే పెట్టుబడులను ఆకర్షించే విషయంలో పోటీ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. ఇండియన్ సిలికాన్ వ్యాలీని ఓడించటానికి తెలంగాణ ఒడిఒడిగా అడుగులు వేస్తూ విజయం సాధిస్తోంది.
ప్రముఖ ఐవేర్ కంపెనీ లెన్స్‌కార్ట్ తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడికి సంబంధించిన ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీని కింద కంపెనీ తెలంగాణలో రూ.1,500 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు పేర్కొంది. ఫ్యాబ్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 2,100 మందికి ఉపాధి అవకాశం కల్పించనున్నట్లు అంచనా వేయబడింది. కంపెనీ ఇక్కడ తన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది.

తెలంగాణలోని ఫ్యాబ్ సిటీలో కంపెనీకి అనువైన ప్రదేశాన్ని ఇప్పటికే గుర్తించారు. ఇక్కడి నుంచి కంపెనీ ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతులతో పాటు భారతీయ మార్కెట్లకు అవసరమైన కళ్లద్దాలు, లెన్సులు, సన్ గ్లాసెస్, యాక్సిసరీస్ సహా ఇతర ఉత్పత్తులను తయారు చేయనుందని సమాచారం. ప్రభుత్వం కంపెనీకి వారంలో అవసరమైన భూ కేటాయింపులు పూర్తి చేసి వారికి దానిని అందించాలని నిర్ణయించింది. అయితే దీనికి ముందు ఏప్రిల్ మాసంలో కంపెనీ సీఈవో పీయూష్ బన్సల్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేస్తూ.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో "మెగా ఫ్యాక్టరీ"ని స్థాపించడానికి 25 ఎకరాల భూమి కోసం అన్వేషణిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇది తెలంగాణకు రావటంతో కర్ణాటకలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయటం లేదని తెలుస్తోంది.
ఆ సమయంలో కర్ణాటక మంత్రి పోస్టుపై స్పందిస్తూ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నప్పటికీ ప్లాన్ ముందుకు సాగలేదు. ప్రస్తుతం తెలంగాణ ఖాతాలో పెట్టుబడి పడింది. 2010లో స్థాపించబడిన లెన్స్‌కార్ట్ కంపెనీకి దేశవ్యాప్తంగా దాదాపు 1,500 రిటైల్ అవుట్‌లెట్లు ఉన్నాయి. కంపెనీ తన అతిపెద్ద తయారీ కేంద్రాన్ని రాజస్థాన్‌లోని భివాడిలో కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications