Boat IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం పూర్తిగా ఐపీవోలకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి కరోనా తర్వాత కొంత కాలం పాటు చాలా కంపెనీలు తమ ఐపీవో ప్లాన్స్ తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం అవితిరిగి ప్లాన్ ట్రాక్ పైకి ఎక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల స్విగ్గీ సైతం అనేక వాయిదాల తర్వాత ఫ్లోట్ చేయబడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బోట్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి ఈ సంస్థ దేశంలోని ప్రముఖ మెుబైల్ యాక్సిసరీస్ అయిన హెడ్‌ఫోన్, ఇయర్‌ఫోన్ తయారీ, విక్రయదారుగా కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ ఐపీవోతో మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. బోట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 300-500 మిలియన్ డాలర్ల విలువైన ఐపీవోను తీసుకొచ్చేందుకు తాజాగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, గోల్డ్‌మన్ సాచ్స్, నోమురాలను బ్యాంకర్లుగా ఎంపిక చేసుకుందని వెల్లడైంది. ప్రధానంగా ఐపీవోకు ఐసీఐసీఐ నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కంపెనీ వాల్యుయేషన్ దాదాపు 1.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది.

వాస్తవానికి దీనికి ముందు సైతం బోట్ ఇలాంటి ప్రయత్నాన్ని చేసింది. అవును 2022లో కంపెనీ ఐపీవో ఫ్లోటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అప్పట్లో మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో తన ప్రయత్నాన్ని విరమించుకుంది. దీని తర్వాత 1.2 బిలియన్ డాలర్ల కనీస విలువతో పెట్టుబడిదారులైన వార్‌బర్గ్ పిన్‌కస్, మలబార్ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి కన్వర్టిబుల్ ప్రాధాన్య స్టాక్ ద్వారా ప్రైవేట్ నిధులలో 60 మిలియన్ డాలర్లు పొందింది. ప్రస్తుతం కంపెనీలో అమన్ గుప్తా 26.80%, సమీర్ మెహతా 26.80%, ఫైర్‌సైడ్ వెంచర్స్ 3.60%, వార్‌బర్గ్ పింకస్ 38.30%, మలబార్ ఇన్వెస్ట్‌మెంట్స్ 1% వాటాలను హోల్డ్ చేస్తున్నారు. వాస్తవానికి కంపెనీని 2015లో అమన్ గుప్తా, సమీర్ మెహతా ప్రారంభించారు. అమన్ గుప్తా షార్క్ ట్యాంక్ ఇండియా న్యాయనిర్ణేతగా మెుదటి సిరీస్ నుంచి వ్యవహరిస్తున్నారు.
బోట్ కంపెనీ ప్రస్తుతం భారతీయ వియరబుల్స్ మార్కెట్లో దాదాపు 27 శాతం వాటాను కలిగి ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.3,285 కోట్లకు చేరుకోగా.. నష్టం సగానికి సగం తగ్గి రూ.70.8 కోట్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న కంపెనీ భారత్ వంటి విస్తారమైన మార్కెట్లో పోటీని తట్టుకుంటూ ముందుకు సాగుతోంది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications