Tata Shares: ఫిబ్రవరి మాసంలో అన్ని కంపెనీల మాదిరిగానే కార్పొరేట్ క్యూ3 ఫలితాలు ప్రకటించాయి టాటా గ్రూప్ కంపెనీలు. దీంతో అనేక టాటా గ్రూప్ కంపెనీల షేర్లు భారీ ర్యాలీతో మార్కెట్లో రికార్డులు సృష్టించాయి. టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ సైతం ఊహించని రీతిలో పెరిగింది.
తాజాగా టాటాలకు చెందిన టాటా పవర్ షేర్లు నేడు ఇంట్రాడేలో ఫోకస్‌లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగటంతో బీఎస్ఈలో కంపెనీ షేర్లు ఇంట్రాడే కనిష్ఠమైన రూ.366 స్థాయికి పడిపోయాయి. దీనికి ముందు గత శుక్రవారం కంపెనీ షేర్లు 4 శాతం పతనమయ్యాయి. డిసెంబర్ త్రైమాసిక ఫలితాల తర్వాత షేర్లలో ఈ క్షీణత కనిపించింది. క్యూ3లో కంపెనీ లాభం ఫ్లాట్‌గా కేవలం రెండు శాతం మాత్రమే పెరిగి రూ.1,076 కోట్లగా నమోదైంది.

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంల కంపెనీ మెుత్తం ఆదాయం రూ.14,841 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-డిసెంబర్, 2023) మొదటి తొమ్మిది నెలల్లో కంపెనీ లాభం రూ.3,235 కోట్లకు పెరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.2,871 కోట్లుగా ఉంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో కంపెనీ ఆదాయం రూ.45,286 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 31, 2023 నాటికి టాటా పవర్ పునరుత్పాదక ఇంధన విభాగంలో 4270 మెగావాట్ల కార్యాచరణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 603.1 కోట్ల యూనిట్ల గ్రీన్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
శుక్రవారం ప్రాఫిట్ బుకింగ్ తర్వాత టాటా పవర్ షేర్లు సోమవారం కూడా క్షీణించాయి. ఈ క్షీణత ఇంకా కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బ్రోకరేజ్ నువామా టాటా పవర్‌పై రేటింగ్‌ను 'హోల్డ్' నుంచి సవరించిన టార్గెట్ ధర రూ.303కి తగ్గించింది. బొగ్గు రాబడులు క్షీణిస్తున్న నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో టాటా పవర్ కో లిమిటెడ్ వృద్ధిని నమోదు చేస్తుందని Nuvama ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. ఇదే క్రమంలో యాంటిక్ బ్రోకింగ్ షేర్లు పెరుగుతాయని నమ్మకంగా ఉంది. టాటా పవర్ టార్గెట్ ధరను గతంలో రూ.422గా ఉన్న రూ.450గా నిర్ణయించింది.


Click it and Unblock the Notifications