Hospital Stock: దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒకటే మాట అదే హెచ్ఎంపీవీ వైరస్ గురించే. ప్రస్తుతం దేశంలో మూడో కేసు గుజరాత్ లో నమోదు కావటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ ఇది స్టాక్ మార్కెట్లను మాత్రం కుదిపేస్తోంది. నేడు ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్ల వరకు పతనమైన సంగతి తెలిసిందే.
ఒక పక్క అలుముకున్న భయాలతో స్టాక్ మార్కెట్లు పతనాన్ని చూస్తున్న వేళ హాస్పిటల్ స్టాక్స్ మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. వాస్తవానికి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు పతనం చూస్తుండటా పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం హాస్పిటల్ స్టాక్స్ పై పడింది. మూడోకేసు కూడా నమోదు కావటంతో రానున్న రోజుల్లో సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. చైనా తర్వాత మలేషియాలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో జపాన్, ఇండియా, హాంకాంగ్ లలో కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో హాస్పిటల్ స్టాక్స్ సడెన్ డిమాండ్ కారణంగా పెరుగుదులను నమోదు చేస్తున్నాయి. ముందుగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నారాయణ హృదయాలయ షేర్లు 3.4 శాతం పెరిగి రూ.1355 స్థాయికి చేరుకున్నాయి. ఇదే క్రమంలో రెయిన్ బో చిన్న పిల్లల హాస్పిటల్స్ షేర్లు 4 శాతం, అపోలో హాస్పిటల్స్, ఏస్థర్ డీఎం హెల్త్ కేర్, కిమ్స్ స్టాక్స్ నేడు ఇంట్రాడేలో దాదాపు 2 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. ఇదే క్రమంలో రానున్న రోజుల్లో డయాగ్నస్టిక్స్ లిస్టెడ్ కంపెనీల షేర్లు కూడా పెరుగుదలను చూసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఫార్మా స్టాక్స్ సైతం కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
సాయంత్రం 3.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1210 పాయింట్ల పతనం చూడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 378 పాయింట్లు పడిపోయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 1028 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1587 పాయింట్లు పతనాన్ని నమోదు చేసింది.
HMPV లక్షణాలు, వ్యాప్తి..?
కరోనా మాదిరిగానే HMPV వైరస్ సోకిన వ్యక్తుల్లో దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి తుంపరల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనికి తోడు జ్వరం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ముక్కులు మూసుకుపోవటం, గొంతు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇన్ఫెక్షన్ కారణంగా కొంతమంది రోగులకు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రస్తుతం సమర్థవంతమైన మందు లేనందున లక్షణాలకు తగ్గట్టుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications