Hindenburg Saga: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్, ఆయన భర్తపై చేసిన ఆరోపణలు పెద్ద ప్రకంపనలు సృష్టించటం ప్రారంభించాయి. ఈ వ్యవహారంపై సంబంధిత వర్గాలు వరుసగా తమ ప్రతిస్పందనను ప్రకటిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆగస్టు 10న విడుదల చేసిన నివేదికపై అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ సంస్థ స్పందించింది. భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్ మధాబి పూరీ బుచ్ భర్త ధవల్ బుచ్ 2009 నుంచి బ్లాక్‌స్టోన్ ప్రైవేట్ ఈక్విటీకి సీనియర్ అడ్వైజర్‌గా ఉన్నట్లు బ్లాక్‌స్టోన్ వెల్లడించింది. అయితే ఆయనకు భారతీయ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (REITలు) లేదా క్యాపిటల్ మార్కెట్‌లలో ఎటువంటి ప్రమేయం లేదని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వర్గాలు తెలిపాయి. బ్లాక్‌స్టోన్‌లో ధవల్ ఆసియా అంతటా ఉన్న ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలకు ప్రొక్యూర్‌మెంట్, సప్లై చైన్ అంశాలపై సలహా ఇవ్వడానికి పరిమితం చేయబడినట్లు వెల్లడించింది.
ఆయనను అనేక ఇంటర్వ్యూల తర్వాత విస్తృతమైన నైపుణ్యాన్ని కలిగిన విభాగాల్లో ఉంచినట్లు పేర్కొంది. అలాగే యూనిలీవర్‌లో మాజీ చీఫ్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్‌గా అతని అనుభవం ఆధారంగా జరిగినట్లు పేర్కొంది. రాబోయే రోజుల్లో బ్లాక్‌స్టోన్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం ధవల్ బుచ్ ప్రస్తుతం బ్లాక్‌స్టోన్ తో పాటు అల్వారెజ్ & మార్సల్ అనే గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థలో సీనియర్ సలహాదారుగా ఉన్నారు. అలాగే దుస్తులు రిటైలర్ అయిన బోర్డ్ ఆఫ్ గిల్డాన్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ధవల్ పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు..
హిండెన్‌బర్గ్ ధవల్ బుచ్ ప్రస్తుత నికర విలువ $10 మిలియన్లుగా అంచనా వేసింది. బ్లాక్‌స్టోన్‌కు సలహాదారుగా ధవల్ బుచ్ ఉన్న సమయంలో రెగ్యులేటర్ సెబీ ప్రధాన REIT నిబంధనల మార్పులను ప్రతిపాదించి, వాటిని ఆమోదించిందని ఆరోపించింది. వాటిలోని నిబంధనలను సులభతరం చేసిందని హిండెన్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది. అలాగే మాధబీ బుచ్ మార్చి 2022లో చైర్‌పర్సన్ అయినప్పటి నుంచి ఆమె భర్త పనిచేస్తున్న భారతదేశంలోని అతిపెద్ద REIT స్పాన్సర్‌లలో ఒకరిగా బ్లాక్‌స్టోన్‌కు గణనీయమైన ప్రయోజనం చేకూర్చే REIT చట్టాన్ని సెబీ ప్రతిపాదించిందనే సంచలన ఆరోపణలు చేసింది.
REIT అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయ్?
పబ్లిక్‌గా-ట్రేడెడ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు నేషనల్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేయబడి సెబీ చేత నియంత్రించబడతాయి. ఐదేళ్ల పాటు రంగం కోసం కొత్తగా ఏర్పడిన అంబ్రెల్లా బాడీ బాండ్లను జారీ చేయవచ్చు లేదా బ్యాంకుయేతర రుణదాతలు లేదా మ్యూచువల్ ఫండ్స్ నుంచి రుణం తీసుకోవచ్చు. అయితే ఇవి నేరుగా బ్యాంకుల నుంచి రుణాలను పొందటానికి వీలు ఉండదు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications