Adani Enterprises: అదానీ వర్సెస్ హిండెన్‌బర్గ్ వివాదంలో సెబీ చీఫ్ మధాబి బుచ్‌పై ఆరోపణలు రావడంతో చాలా మంది ఇన్వెస్టర్లు నేడు మార్కెట్లో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఈ క్రమంలో నేడు అదానీ గ్రూప్ స్టాక్స్ ఉదయం దాదాపు 7 శాతం వరకు పడిపోయాయి. దీని ఫలితంగా 10 అదానీ లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.53,000 కోట్లు క్షీణించింది. ఇది ఇన్వెస్టర్ల సంపదను భారీగా ఆవిరిచేసింది.
ఇంట్రాడేలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 7% నష్టాన్ని చవిచూశాయి. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 5%, అదానీ పవర్ 4%, అదానీ విల్మార్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3% మేన నష్టంతో ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి. అలాగే అదానీ పోర్స్ట్ షేర్లు 2 శాతం క్షీణించాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అదానీకి చెందిన ఫ్లాగ్‌షిప్ ఎంటిటీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిఫ్టీలో టాప్ లూజర్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇంట్రాడేలో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు ఉదయం రూ.3100 వద్ద ప్రారంభమైనప్పటికీ భారీగా క్షీణించి రూ.3014 స్థాయికి దిగజారాయి. అయితే తర్వాత భారీ నష్టాల నుంచి తేరుకుంటోంది.

గత ఏడాది జనవరిలో అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌ను కార్నర్ చేసిన సమయంలో కూడా అదానీ కంపెనీ షేర్లు భారీ క్షీణతను చూశాయి. అప్పట్లో అది గౌతమ్ అదానీ సంపదతో పాటు కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం భారీ నష్టాలకు దారితీసింది. జనవరి 24, 2023న హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, ఆడిటింగ్ స్కామ్‌ని ఆరోపించింది. వాస్తవానికి అదానీ ఎంటర్ ప్రైజెస్ భారత మార్కెట్ల చరిత్రలో అతిపెద్ద ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ.20 వేల కోట్లను నిర్వహించిన సమయంలో దాడిని ప్రారంభించింది. దీంతో ఆఫర్ పూర్తైనప్పటికీ అదానీ దానిని క్యాన్సిల్ చేసి డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చిన సంగతి తెలిసిందే.
అదానీ లిస్టెడ్ స్టాక్స్ పరిస్థితి గమనిస్తే.. ఇంట్రాడేలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 17 శాతం తగ్గి రూ.915.70, అదానీ టోటల్ గ్యాస్ 13 శాతం నుంచి రూ.753, NDTV స్టాక్ 11 శాతం తగ్గి రూ.186.15, అదానీ పవర్ 11 శాతం తగ్గి రూ.619 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మార్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ స్టాక్స్ ఇంట్రాడేలో 2 శాతం నుంచి 7 శాతం మధ్య క్షీణతను చూశాయి.


Click it and Unblock the Notifications