Gold News: ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చే దేశాల్లో ఇండియా ముందు వరుసలో ఉంటుంది. భారతీయులకు పసిడి అంటే ఎంత ఇష్టమంటే కుదిరినప్పుడల్లా లేదా ప్రతి చిన్న కార్యక్రమానికి ఒక్క గ్రాము అయినా వాళ్లు పసిడిని కొనుగోలు చేస్తూనే ఉంటారు. అందుకే ఇండియా గోల్డ్ దిగుమతుల విషయంలో అగ్రస్థానంలోనే కొనసాగుతూ ఉంటుంది. వాస్తవానికి ఇది దేశ వాణిజ్య లోటును అధికంగా ఉండేలా కూడా చేస్తుంది.
కొత్త ఏడాది ప్రారంభమైన నాటి నుంచి గోల్డ్ ధరలు నిరంతరాయంగా పెరుగుతూ పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న భారతీయ కుంటుంబాలకు ఆందోళనను మిగులుస్తోంది. ఈ క్రమంలో నిరంతరం పెరుగుతున్న ధరలతో గోల్డ్ డిమాండ్ తగ్గుతోందని వ్యాపారులు, విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి జనవరిలో గోల్డ్ దిగుమతులు 30-35 టన్నులు ఉండగా.. ఫిబ్రవరిలో ఇది సగానికి తగ్గిపోయింది. నెల చివరి నాటికి దిగుమతి చేసుకున్న గోల్డ్ 15 టన్నులకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర ఏకంగా రికార్డు స్థాయిలో 2956 డాలర్లకు చేరుకుంది. ఇది గతంలో నిపుణులు అంచనా వేసిన 3000 డాలర్ల మార్కుకు అతి చేరువలో ట్రేడింగ్ కొనసాగించటం మరింత ఆందోళనలకు దారితీస్తోంది.

అమెరికా కొత్త అధ్యక్షుడి ట్రంప్ వాణిజ్య సుంకాలతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితితో సేఫ్ హెవెన్ పసిడి ధరలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో యూరోపియన్ దేశాలపై కూడా ఆంక్షలు ఉంటాయనే ఆందోళనల మధ్య అమెరికాకు చెందిన టాప్ బ్యాంకులైన హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గన్ వంటి సంస్థలు పసిడిని అక్కడి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి వెనక్కి తెప్పించుకుని న్యూయార్క్ మార్కెట్లో ఉన్న అధిక ధరల వ్యత్యాసాన్ని లాభాలుగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇలాంటి అధిక ధరల సమయంలో డిమాండ్ తగ్గటంతో పాటు వ్యాపారులు సైతం నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రస్తుతం అత్యల్పస్థాయికి దిగుమతులు పడిపోవటంతో పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ట్రంప్ దూకుడు చర్యలతో పెరుగుతున్న గోల్డ్ రేట్ల వల్ల 2025 జనవరిలో గోల్డ్ దిగుమతులు 6 నెలల కనిష్ఠ స్థాయి 30-35 టన్నులకు తగ్గాయి. ఈ నెలలో పరిస్థితులు మరింతగా దిగజారి జనవరి కంటే దిగుమతులు సగానికి తగ్గిపోవటంతో వ్యాపారులు కొనుగోలుదారులు లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నప్పటికీ డిమాండ్ కనిపించకపోవటం ఇది సాధారణంగా బంగారు ఆభరణాల డిమాండ్‌కు గరిష్ట స్థాయిగా పరిగణించబడుతుందని రిద్దిసిద్ధి బులియన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారి తెలిపారు. ఈతరుణంలో వ్యాపారులు తమ లాభాల మార్జిన్లను తగ్గించుకునేందుకు సైతం వెనకాడటం లేదు.
కొన్ని బ్యాంకులు మొదట భారతదేశంలోకి దిగుమతి చేసుకున్న బంగారాన్ని అమెరికాకు పంపడం ప్రారంభించాయని, అక్కడ అధిక ప్రీమియం నేపథ్యంలో రాబడి మెరుగ్గా ఉందని కొఠారియా వెల్లడించారు. ప్రస్తుతం కొనుగోలుదారులు దొరకకపోవటంతో భారతదేశంలోని ఆభరణాల తయారీదారుల హోల్‌సేల్ బులియన్ మార్కెట్ డిసెంబర్‌లో ఔన్సుకు 23 డాలర్ల తగ్గింపును అందిస్తోంది. వాస్తవానికి ఈ తగ్గింపు డిసెంబరులో కేవలం ఔన్సుకు 3 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ధరలు పెరుగుతున్నాయి మరియు 10 గ్రాములకు 14 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.86,831కి చేరుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం దేశీయ మార్కెట్లో బంగారం విలువను పెంచిందని కమోడిటీ నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం, డైమండ్లపై భారీ డిస్కౌంట్లు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications