Work From Home: అక్కడి టెక్కీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించిన ఐటీ కంపెనీలు..!!
Chennai Rains: వాస్తవానికి దేశంలోని ఐటీ సేవల రంగంలోని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విదానాన్ని దాదాపుగా నిలిపివేశాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు తమ ప్రొడక్టివిడీ దెబ్బతినకుండా అలాగే ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవకుండా ముందు జాగ్రత్తల్లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కల్పిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ప్రస్తుతం తమిళనాడులో వాతావరణం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరికలు వచ్చాయి. ఈ క్రమంలో తమిళనాడులోని చెన్నై, తిరువనంతపూర్, కాంచీపురం, పుదుచ్చెరీతో పాటు అనేక ఇతర జిల్లాల్లో భారీ వర్ష సూచనలు ఉన్నట్లు ఇప్పటికే IMD హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో భారీ వరదలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనివల్ల కలిగే అంతయారాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. దీంతో ఈ నగరాల్లో ఉన్న టెక్ కంపెనీలకు సైతం హెచ్చరికలు జారీ అయ్యాయి.

దీని కారణంగా చెన్నై, చెంగల్ పట్టు, తిరువల్లూర్, కాంచీపురంలోని అధికారులు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతికూల వాతావరణంలో భద్రతలో భాగంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అందించాలని ఐటీ రంగంలోని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి పెద్ద కంపెనీలతో పాటు మరిన్ని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ అడ్వైజరీని జారీ చేసినట్లు తెలుస్తోంది. వర్షం సమయంలో పవర్ కట్స్, ఇంటర్నెట్ సేవల్లో అంతరాయాలు వంటివి ఇంటి నుంచి పనిచేసే టెక్కీలకు పెద్ద తలనొప్పిని కలిగించొచ్చని తెలుస్తోంది.
ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కి.మీ వేగంతో ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. పుదుచ్చేరిలో కూడా భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఏపీకి కూడా వర్ష సూచన..
తమిళనాడుతో పాటు ఏపీకి కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయబడ్డాయి. రానున్న నాలుగేళ్ల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాకాతంలో ఉపరితల ఆవర్తన రేపు అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. దీంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ హెచ్చరికలపై ఏపీ ప్రభుత్వం సైతం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో పాటు అధికారులను సైతం ముందస్తుగానే అప్రమత్తం చేశారు సీఎం చంద్రబాబు.


Click it and Unblock the Notifications