Gold Price Today: శనివారం పసిడి ధర భారీ పతనం తర్వాత కూడా ఆది, సోమవారాలు స్థిరత్వాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో చాలా మంది రిటైల్ వినియోగదారులు షాపింగ్ చేశారు. అయితే నేడు మళ్లీ గోల్డ్ రేటు ఒక్కసారిగా పదునైన పెరుగుదలను నమోదు చేసింది. దీంతో కొనటం లేటుచేసినవారు ఫీల్ అవుతున్నారు.
మంగళవారం అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా పసిడి ధరలను గమనిస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1500 పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన తాజా రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.6,645, ముంబైలో రూ.6,585, దిల్లీలో రూ.6,600, కలకత్తాలో రూ.6,585, బెంగళూరులో రూ.6,585, కేరళలో రూ.6,585, వడోదరలో రూ.6,590, నాశిక్ లో రూ.6,588, అయోధ్యలో రూ.6,600, బళ్లారిలో రూ.6,585, గురుగ్రాములో రూ.6,600, నోయిడాలో రూ.6,600గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే 100 గ్రాములకు ఏకంగా రూ.1700 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో ప్రస్తుతం పెరిగిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.7,249, ముంబైలో రూ.7,184, దిల్లీలో రూ.7,199, కలకత్తాలో రూ.7,184, బెంగళూరులో రూ.7,184, కేరళలో రూ.7,184, వడోదరలో రూ.7,189, నాశిక్ లో రూ.7,187, అయోధ్యలో రూ.7,199, బళ్లారిలో రూ.7,184, గురుగ్రాములో రూ.7,199, నోయిడాలో రూ.7,199గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,585గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,184 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,200 తగ్గి రూ.95,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications