Gold Price Today: పసిడి ధరలు సామాన్యులను హడలెత్తిస్తున్నాయి. వాస్తవానికి నిన్న ఎంసీఎక్స్ లో 10 గ్రాముల ధర ఫ్యూచర్స్ ట్రేడింగ్ సమయంలో రూ.83,750 స్థాయికి చేరుకుంది. వాస్తవానికి కొనుగోలుదారుల నుంచి మద్దతు పెరుగుతున్న వేళ తాజా పెంపులు వచ్చాయని తెలుస్తోంది. బడ్జెట్ ప్రసంగానికి ముందు ధరలు పెరగటం రిటైల్ కొనుగోలుదారులను వణికిస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7610, ముంబైలో రూ.7610, దిల్లీలో రూ.7625, కలకత్తాలో రూ.7610, బెంగళూరులో రూ.7610, కేరళలో రూ.7610, వడోదరలో రూ.7615, జైపూరులో రూ.7625, లక్నోలో రూ.7625, కోయంబత్తూరులో రూ.7610, నాశిక్ లో రూ.7613, అయోధ్యలో రూ.7625, బళ్లారిలో రూ.7610, గురుగ్రాములో రూ.7625, నోయిడాలో రూ.7625 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1700 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తాజా రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8302, ముంబైలో రూ.8302, దిల్లీలో రూ.8317, కలకత్తాలో రూ.8302, బెంగళూరులో రూ.8302, కేరళలో రూ.8302, వడోదరలో రూ.8307, జైపూరులో రూ.8317, లక్నోలో రూ.8317, కోయంబత్తూరులో రూ.8302, నాశిక్ లో రూ.8305, అయోధ్యలో రూ.8317, బళ్లారిలో రూ.8302, గురుగ్రాములో రూ.8317, నోయిడాలో రూ.8317గా ఉన్నాయి. పైన పేర్కొన్న ధరల్లో తరుగు, మజూరి, జీఎస్టీ, వ్యాపారి లాభాలు కలపకముందువిగా గుర్తుంచుకోవాలి.
బడ్జెట్ భయాలు..
వాస్తవానికి గత బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం దిగుమతులపై సుంకాన్ని భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వినియోగం భారీగా పెరగటంతో దిగుమతులు పెరిగాయనే వాదన వినిపిస్తోంది. అయితే దీనిని అదుపుచేసేందుకు ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పసిడి దిగుమతులపై భారీగా పన్నులను పెంచవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది దిగుమతులు పెరుగుదలతో ట్రేడ్ డెఫిసిట్ పెంచుతోందని నిపుణులు వాదిస్తున్నారు. ప్రస్తుతం డాలర్ ధర బలంగా ఉండటంతో పాటు రూపాయి మారకపు విలువ పడిపోవటం ఆర్థిక లోటును మరింతగా పెంచుతోందని నిపుణులు చెప్పటం భయాలకు కారణంగా తెలుస్తోంది.
హైదరాబాదులో గోల్డ్ రేట్లు..
ఇదే క్రమంలో తెలంగాణలోని.. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7610గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8302 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.2000 పెరగటంతో నేడు రూ.1,06,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications