For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SpiceJet: తిరిగి గాల్లోకి స్పైస్‌జెట్..! గో ఫస్ట్ కుప్పకూలటం కలిసొస్తుందా..? ఫుల్ ప్లాన్..

|

SpiceJet: దేశీయ విమానయాన రంగంలో కొంత గందరగోళ పరిస్థితులు అలుముకున్నాయి. నిన్న గో ఫస్ట్ డబ్బు కొరతతో దివాలా తీస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకోవాలని స్పైస్‌జెట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

గో ఫస్ట్ దివాలా తీసిన తీయటంతో స్పైస్‌జెట్ పెద్ద నిర్ణయం తీసుకుంది. గ్రౌండ్ ఫ్లీట్‌ను తిరిగి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ వెల్లడించారు. దాదాపు 25 విమానాలను పునరుద్ధరించడానికి రూ. 400 కోట్ల రుణం తీసుకోవాలని చూస్తోంది. పునరుద్ధరణ కోసం నిధులను ప్రభుత్వ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) తీసుకోనున్నట్లు తెలిపారు.

SpiceJet:

త్వరలోనే గాల్లోకి తమ గ్రౌండెడ్ విమానానలు తిరిగి సేవల్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు అజయ్ సింగ్ తెలిపారు. ECLGS నిధుల్లో ఎక్కువ భాగం వినియోగించి.. రాబోయే పీక్ ట్రావెల్ సీజన్‌ను క్యాపిటలైజ్ చేయడంలో, సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ ప్రయత్నిస్తోంది.

ఇంజన్ తయారీదారు ప్రాట్ & విట్నీ సరఫరాను నిలిపివేయటంతో చాలా విమానాలు ఎగరలేని పరిస్థితిలో ఉన్నాయని వాడియా గ్రూప్ ఎయిర్‌లైన్ గో ఫస్ట్ సీఈవో కౌశిక్ ఖోనా తెలిపారు. దీనివల్ల కంపెనీకి నిధుల కొరత ఏర్పడి చమురు కంపెనీలకు బకాయిలను చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కంపెనీలు చమురు సరఫరాను నిలిపివేయగా.. రెండు రోజుల పాటు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.

English summary

SpiceJet: తిరిగి గాల్లోకి స్పైస్‌జెట్..! గో ఫస్ట్ కుప్పకూలటం కలిసొస్తుందా..? ఫుల్ ప్లాన్.. | Amid Go First bankruptcy filings Budget Carrier Spicejet planning to revive services

id Go First bankruptcy filings Budget Carrier Spicejet planning to revive services
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X