Pakistan Crisis: ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం ఆవేశం, రాజకీయ అనిశ్చితి వంటి కారణాలతో దాయాది పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఫారెక్స్ నిల్వలు వేగంగా తరిగిపోతున్న ఈ క్రమంలో పాకిస్థాన్ కొత్త సమస్యలను ఎదుర్కొంటోంది.
చరిత్రలో మెుదటిసారిగా పాకిస్థాన్ రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే కొత్త కనిష్ఠాలకు జారుకుంది. ఈ విలువ 301కి చేరుకుంది. అంటే ఒక డాలర్ కొనుగోలు చేయాలంటే 301 పాకిస్థాన్ రూపాయలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో ఒక డాలర్ ధర రూ.299గా నమోదైంది. దీనివల్ల దిగుమతులు మరింత ప్రియం కానున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అవటంతో దేశం భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పాకిస్థాన్ దివాళా తీసినట్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది.

పాక్ వద్ద విదేశీ మారక నిల్వలు 4.5 బిలియన్ డాలర్లకు చేరుకోవటంతో అవి కేవలం ఒక నెల దిగుమతుల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయని తెలుస్తోంది. దీనివల్ల పాక్ నగదు కొరతతో సతమతమవుతోంది. దీనికి తోడు విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. ప్రస్తుతం దాయాది దేశంలో కిలో చికెన్ ధర రూ.437, పిండి రూ.135, గుడ్లు డజను రూ.275, దుంపలు కిలో రూ.78, పాలు లీటరు రూ.168, డీజిల్ లీటరు రూ.289, పెట్రోల్ లీటరు రూ.283గా కొనసాగుతున్నాయి.
ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పాక్ లో ద్రవ్యోల్బణం ప్రతి నెల కొత్త గరిష్ఠాలకు చేరుకుంటోంది. ఏప్రిల్ మాసంలో ఇది గరిష్ఠంగా 36.4 శాతానికి చేరుకుంది. ఇది ఆర్థికంగా దివాలా తీసిన శ్రీలంకలో ఉన్న ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ కావటం ఆందోళనలకు దారితీస్తోంది. ప్రస్తుతం పాక్ ఆసియాలో అత్యధిక ద్రవ్యోల్బణాన్ని కలిగి ఉన్నందున రోజురోజుకూ మరింతగా దిగజారుతోంది.
ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు IMF నుంచి బెయిల్ అవుట్ నిధులను పొందటం కోసం నానా తంటాలు పడుతోంది. ఐఎంఎఫ్ పెట్టిన అన్ని షరతులను పూర్తి చేసేందుకు యత్నిస్తోంది. తమకు 1.1 బిలియన్ డాలర్ల వాయిదా మెుత్తాన్ని విడుదల చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిరంతరం డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఈ నిధులను సకాలంలో పొందలేకపోతే పాక్ చేయాల్సిన చెల్లింపులు డిఫాల్ట్ అయ్యి దివాలా తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications