Gold Rate: శుక్రవారం శపించిన కలకమహాలక్ష్మి.. నేడు రూ.7600 పెరిగిన గోల్డ్ రేటు..
Gold Price Today: వరుసగా రెండు రోజులు తగ్గుతూ కొనుగోలుదారులకు ఉపశమనం అందించిన గోల్డ్ రేట్లు నేడు తిరిగి భారీ పెరుగుదలతో అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో వారాంతంలో పసిడి ఆభరణాల షాపింగ్ కి వెళదాం అని ప్లాన్ చేసుకున్న చాలా మంది నేటి ధరల పెరుగుదలతో షాక్ కి గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా, బతుకమ్మ వేడుకల వేళ పెళ్లిళ్లు, దీపావళి షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు రేట్లు చూసి అవాక్కవుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7095, ముంబైలో రూ.7095, దిల్లీలో రూ.7020, కలకత్తాలో రూ.7095, బెంగళూరులో రూ.7095, కేరళలో రూ.7095, వడోదరలో రూ.7010, అహ్మదాబాదులో రూ.7010, జైపూరులో రూ.7020, మంగళూరులో రూ.7095, నాశిక్ లో రూ.7098, అయోధ్యలో రూ.7020, బళ్లారిలో రూ.7095, గురుగ్రాములో రూ.7020, నోయిడాలో రూ.7095 వద్ద నేడు గ్రాముకు విక్రయించబడుతున్నాయి. పైన పేర్కొన్న ధరలు డీఎస్టీ, షాపు వాళ్ల లాభాలు, తరుగుకు ముందు రేట్లుగా గుర్తుంచుకోండి.

ఇదే క్రమంలో 24 క్యారెట్లో గోల్డ్ రేట్లు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7600 పెరుగుదలను చూసింది. దీంతో ధరలు పెరిగిన తర్వాత నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7740, ముంబైలో రూ.7740, దిల్లీలో రూ.7755, కలకత్తాలో రూ.7740, బెంగళూరులో రూ.7740, కేరళలో రూ.7740, వడోదరలో రూ.7745, అహ్మదాబాదులో రూ.7745, జైపూరులో రూ.7755, మంగళూరులో రూ.7740, నాశిక్ లో రూ.7098, అయోధ్యలో రూ.7755, బళ్లారిలో రూ.7740, గురుగ్రాములో రూ.7755, నోయిడాలో రూ.7740 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7095గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7740 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2000 పెరిగి రూ.1,02,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications