Market Rally: చాలా కాలంగా మార్కెట్లు ఎదురుచూస్తున్న యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన వచ్చేసింది. ఫెడ్ చైర్ పర్సన్ పావెల్ 2020 తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా మార్కెట్లు భారీ ర్యాలీని చూస్తున్నాయి. ఈ ఏడాది ఫెడ్ మెుత్తంగా 100 బేసిస్ పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరో రెండు 25 బేసిస్ పాయింట్ల తగ్గింపులు ఉంచొచ్చని వారు చెబుతున్నారు.
ఇదే నిన్న రాత్రి యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను తగ్గించటంతో భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ ర్యాలీని చూస్తున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు తన సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ఉదయం 9.22 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 83,684.18 పాయింట్లను తాకింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 25,481.70 పాయింట్లను తాకింది. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 579 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, నిఫ్టీ సూచీ 160 పాయింట్ల గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 419 పాయింట్లు పెరగగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 333 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.

యూఎస్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయంతో మార్కెట్‌లో ఉత్సాహం నెలకొంది. మార్కెట్ బూమ్ కారణంగా ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. మార్కెట్‌లో తుఫాను పెరుగుదల కారణంగా బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ కూడా దాదాపు రూ.471 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్ రికార్డు ర్యాలీలో ఐటీ రంగంలో అత్యధిక కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో పాటు రియల్టీ, బ్యాంకింగ్, ఆటో రంగాల రంగాలకు చెందిన కంపెనీల షేర్లు సైతం ఇన్వెస్టర్ల కొనుగోళ్లలో నేడు కొనసాగుతున్నాయి.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతదేశానికి తమ ఎక్స్పోజర్‌ను గణనీయంగా పెంచకుండా నిరోధించే ముఖ్య కారకాల్లో ఒకటి మార్కెట్ ఓవర్ వ్యాల్యుయేషన్. భారత మార్కెట్లు చాలా పెరిగాయని, ఖరీదైనవిగా మారాయని బ్యాంక్ జూలియస్ బేర్ & కో మార్క్ మాథ్యూస్ అన్నారు. ఈ క్రమంలో ఎన్టీపీసీ, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఆటో, హీరో మోటార్స్, టైటాన్, టాటా కన్జూమర్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టాటా మోటార్స్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications