Market Selloff: భారతీయ స్టాక్ మార్కెట్ల ప్రయాణం 2025కి ముందు మెగా ర్యాలీతో పట్టుకున్నదల్లా బంగారం లాగా ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ఇదే సమయంలో ఐపీవోల విపరీతమైన రాకతో మార్కెట్లలో ఇన్వెస్టర్లు కళ్లు మూసుకుని డబ్బులు కుమ్మరించారు. ఆ రోజు వారు ఎగబడి కొన్న షేర్లే నేడు వారిని నిండా ముంచాయని తాజా నివేదికలు తేల్చేశాయి.
వివరాల్లోకి వెళితే భారతీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు కొన్ని నెలల కిందట అధికంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఈ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ కి కూడా భారీగా డబ్బుల రాక వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకుల సమయంలో మెజారిటీ స్మాల్ క్యాప్ కేటగిరీ షేర్లు కరెక్షన్ చూడటంతో పతనాన్ని నమోదు చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల డబ్బు కర్పూరంలాగా కరిగిపోతోంది. దీంతో 2025 ప్రారంభం నుంచి స్మాల్ క్యాప్ కంపెనీలు పెట్టుబడిదారులకు దాదాపు రూ.16 లక్షల కోట్ల భారీ నష్టాన్ని అందించాయి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు ఈ విషయంలో కొంత అదృష్టంతో భారీ నష్టాలను చూడనప్పటికీ.. నేరుగా షేర్లపై బెట్ వేసిన అనేక మంది పెట్టుబడిదారులకు మాత్రం ప్రస్తుతం కన్నీళ్లే మిగిలాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 70 శాతం మార్కెట్ విలువను కోల్పోయిన కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ పేర్లను పరిశీలిస్తే.. Jai Corp Ltd, Vakrangee Ltd, Zen Technologies Ltd, Quick Heal Technologies Ltd, Swelect Energy Systems Ltd, Precision Camshafts వంటివి ఉన్నాయి.
పైగా భారతీయ స్టాక్ మార్కెట్లో జాబితా అయిన 936 బీఎస్ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో దాదాపు 55 శాతం షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడటం పెట్టుబడిదారులకు నిరాశను మిగిల్చింది. బేర్స్ పంజాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ కేటగిరీ షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి రోజురోజుకూ పెరగటంపై ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్‌కు చెందిన ప్రతీక్ గుప్తా మాట్లాడుతూ చాలా సందర్భాలలో ఖరీదైన వాల్యుయేషన్‌ల కారణంగా సాధారణంగా స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ స్టాక్‌లపై తాను జాగ్రత్తగా ఉన్నానని అన్నారు. ఈ ఏడాది నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో కరెక్షన్ ఉన్నప్పటికీ తన ప్రతికూల అభిప్రాయం అలాగే కొనసాగిస్తానని పేర్కొన్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications