BSNL Q3 Results: భారతీయ టెలికాం మార్కెట్లో పెద్ద మార్పులకు ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ పునాది వేస్తోంది. దాదాపు దశాబ్ధకాలంగా టెలికాం రంగంలో అంబానీకి చెందిన జియో మోనోపొలీకి బిర్లాలకు చెందిన వొడఫోన్ ఐడియా బ్రేకులు వేయటంలో బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ డీసెంట్ ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికీ రిలయన్స్ జియో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై ఆట పూర్తిగా మారిపోబోతోంది.
ప్రస్తుతం భారతీయ టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ పెద్ద ఆటగాడిగా తన ప్రయాణాన్ని చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. వాస్తవానికి గత ఏడాది ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికా మర్చంట్ వివాహం తర్వాత పెంచిన టారిఫ్స్ యూజర్లలో పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్లలో యూజర్లు ఘర్ వాపసీ అంటూ బీఎస్ఎన్ఎల్ కి తిరిగి రావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో బీఎస్ఎన్ఎల్ టాటాల సహకారంతో దేశవ్యాప్తంగా 4జీ, 5జీ లాంచ్ కోసం అవసరమైన టవర్స్, టెక్నాలజీని నిర్మించుకోవటం యూజర్లలో నమ్మకాన్ని పెంచింది. పైగా తాము టారిఫ్స్ పెంచే ఉద్ధోశ్యంలో లేమని కూడా కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4G సేవలపై దృష్టి సారిస్తోంది. దీనికి అనుగుణంగానే కేంద్రం కూడా కంపెనీకి 4జీ విస్తరణ కోసం మరో రూ.6,000 కోట్లను కేటాయించింది. ఈ క్రమంలోనే కంపెనీ దాదాపు 17 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అక్టోబర్-డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసికంలో రూ.262 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఒకపక్క వొడఫోన్ ఐడియా భారీ నష్టాల్లో కొనసాగుతున్న వేళ బీఎస్ఎన్ఎల్ మాత్రం లాభాల బాట పట్టడం శుభపరిణామంగా యూజర్లు భావిస్తున్నారు.
బీఎస్ఎన్ఎల్ లాభాలకు దారితీసిన పరిణామాలను గమనిస్తే.. నిరంతరం బీఎస్ఎన్ఎల్ తన సేవలను విస్తరిస్తూ, కస్టమర్ బేస్ పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలతవంతంగా మారాయి. సేవల్లో కొనసాగుతున్న మెరుగుదలను ఇది సూచిస్తోంది. డిసెంబర్‌లో కస్టమర్ల సంఖ్య కూడా దాదాపు 9 కోట్లకు పెరిగింది. ఇదే క్రమంలో మొబైల్, ఫైబర్ టు ది హోమ్, లీజుకు ఇచ్చిన లైన్ సర్వీస్ ఆఫర్లలో 14-18 శాతం వృద్ధిని నమోదు చేయటం బీఎస్ఎన్ఎల్ బ్యాక్ టూ గెయిన్స్ కి దారితీసింది.
కంపెనీ చివరి సారిగా లాభాలను 2017లో జరిగింది. అయితే ప్రస్తుతం మూడవ త్రైమాసికంలో ఫైబర్ టు ది హోమ్ ఆదాయం 18%, లీజుకు తీసుకున్న లైన్ సర్వీస్ ఆదాయం 14% పెరుగుదలను చూశాయి. ఇవి కంపెనీ నష్టాలను తగ్గించటంలో కీలక పాత్ర పోషించాయని తెలుస్తోంది. మోదీ నేతృత్వంలో కంపెనీ ప్రస్తుతం లక్ష టవర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 75 వేల టవర్లను కంపెనీ ఇన్స్టాల్ చేసింది. వీటిలో 65 వేల టవర్లు సేవలను అందించటం ప్రారంభించాయి. మిగిన టవర్ల ఏర్పాటు త్వరలో పూర్తి చేసి జూన్ 2025 నాటికి వాటిని సేవల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. కంపెనీ ప్రస్తుతం యూజర్లకు జాతీయ వైఫై రోమింగ్,
BiTV, IFTTVను కూడా అందిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications