Hyderabad: ఇంటర్నెషనల్ ఫార్మా హబ్‌గా హైదరాబాద్ అన్న KTR.. పెట్టుబడుల ప్రవాహం..
Hyderabad: రానున్న ఐదేళ్ల కాలంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ 50 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ప్రపంచంలో మేజర్ ఇంటర్నేషనల్ హబ్ గా మారుతుందని ఆయన తెలిపారు. ఫార్మా ఉత్పత్తుల తయారీకి ఫార్మా సిటీ సహాయంగా నిలుస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్న 20వ బయో ఆసియా సమావేశానికి ముందు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గడచిన 19 ఏళ్లుగా హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ రూ.25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ దాదాపు 4 లక్షల మందికి ఉపాధిని అందిస్తోంది. రానున్న ఐదేళ్లలో ఫార్మా అనుబంధ రంగాలు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని వెల్లడించారు.

ఈ రంగంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్ గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఏటా 900 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు తయారవుతున్నాయి. ఇవి ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 35 శాతానికి సమానం. వచ్చే ఏడాది ఈ సంఖ్యను 1,400 కోట్ల డోస్‌లకు పెంచి ప్రపంచ ఉత్పత్తిలో 50 శాతానికి చేరుకుంటామని కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం నగర శివారులోని 14,000 ఎకరాల్లో నిర్మించబడుతున్న ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ముగింపు దశకు చేరుకుందని వెల్లడించారు.
USFDA అనుమతి కలిగిన ఫార్మా ఉత్పత్తి కేంద్రాలు ప్రపంచంలో అత్యధికంగా 214 హైదరాబాద్ లో ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. దీని తర్వాత రెండవ స్థానంలో అమెరికాలోని న్యూజెర్సీ 189 ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉందన్నారు. దీనికి తోడు హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల పార్క్, ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ తయారీ సౌకర్ధ్యాలను కలిగి ఉన్న విషయాన్ని మంత్రి తెలిపారు.

ప్రఖ్యాత ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మా తెలంగాణలోని జీనోమ్ వ్యాలీలో తన ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు తాజాగా రూ.400 కోట్లను పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీనికి ముంది ఫిబ్రవరి 2022లో కంపెనీ రూ.300 కోట్ల పెట్టుబడితో తన ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు ఏడాది కిందట ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెట్టుబడుల ద్వారా "బయోలాజికల్స్, బయోసిమిలర్, యాంటీబాడీస్, రీకాంబినెంట్ ఇన్సులిన్‌లను తయారు చేసేందుకు అదనపు సామర్థ్యాలను చేర్చాలని" ఉద్ధేశించినట్లు సంస్థ పేర్కొంది.


Click it and Unblock the Notifications