AP Budget 2025: ఈసారి ఏపీ బడ్జెట్లో రైతన్నకు భరోసా దక్కేనా..? అసలు ఏఏ స్కీమ్స్ ఉన్నాయ్..?

YS Jagan News: ఏపీలో మరికొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ అవుతున్నప్పటికీ మార్చి 3న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఈసారి బడ్జెట్లో రైతన్నలకు ఎలాంటి ప్రయోజనాలు అందించబడతాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు సర్కార్ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీ కోసం నిధుల కేటాయింపు ఉంటుందా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.

వివరాల్లోకి వెళితే గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేనతో కూడిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మాజీ ముఖ్యమంత్రి నేడు గుంటూరులోని మిర్చియార్డులో రైతులను కలిసి వారి సమస్యలపై స్పందించారు. మిర్చికి గిట్టుబాటు ధర పడిపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ప్రభుత్వ హయాంలో రైతన్నలు పంటలను విక్రయించుకోవటానికి మద్ధతు ధరలను అందించామని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Amid AP Budget 2025 nearing YS Jagan Fires over Chandrababu for Neglecting Farmers in Guntur Mirchi Yard Today

రైతులకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్ వివరాలు..

-వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా ఆర్థిక సహాయాన్ని అందించటం జరిగింది. దీనికింద మెుత్తంగా అర్హులైన రైతులకు రూ.13,500 చెల్లించారు. మెుదట విడతలో రూ.7500, రెండవ విడతలో రూ.4000, మూడవ విడతలో రూ.2000 చొప్పున నేరుగా అర్హుల ఖాతాల్లో డబ్బు జమచేయబడిన సంగతి తెలిసిందే.

- రైతులకు వైసీపీ ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీ పథకం కింద రుణాలను కూడా అందించింది. ఇది రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు ఆర్థిక భారం లేకుండా చేయటంతో పాటు ఆర్థిక క్రమశిక్షణను అలవాటుగా మార్చి వారికి వడ్డీ లేకుండా నిధులు పొందటానికి సహాయంగా నిలిచింది. ఇదే క్రమంలో ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందించటం ద్వారా ఏడాదికి ఒక్కో రైతుకు రూ.45 వేల వరకు ప్రయోజనం లభించిందని అప్పట్లో వైఎస్ జగన్ వెల్లడించారు.

- ఇక రైతులకు వైసీపీ ప్రభుత్వ సమయంలో అందించబడిన మరో స్కీమ్ ఉచిత పంట బీమా. పంట నష్టం వల్ల రైతులు ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు దేశవ్యాప్తంగా మనం చూశాం. అందువల్ల రైతులకు ప్రయోజనకరంగా ఉండటంతో పాటు రైతుల తరఫున బీమా ప్రీమియం కూడా అప్పట్లో జగన్ సర్కార్ చెల్లించి దేశంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. దీని కింద ఏసీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులు పొందటానికి అవకాశం లభించింది. అలాగే రైతుల కోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా విత్తనాలు, పురుగుమందుల లభ్యతను సులభతరం చేస్తూ.. ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోలును అప్పట్లో వైసీపీ సర్కార్ చేపట్టింది.

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు..
రైతుల కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీల్లో ఒకదానిని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ఎన్నికల మేనిఫెస్టో అయిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ కోసం మార్చిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో నిధుల కేటాయింపుల కోసం అన్నదాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రైతులకు అన్యాయంపై వైఎస్ జగన్ ఫైర్..
మిర్చియార్డులో రైతుల కష్టాలను నేడు గుంటూరు పర్యటనలో జగన్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంటకు కనీసం మద్దతు ధర లేదని, మిర్చి రైతులు పడిపోతున్న ధరలతో నష్టాలను చవిచూస్తున్నారని అన్నారు. ఎరువులను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు జగన్ ఆరోపించారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాల సరఫరా కొనసాగటంలేదన్న జగన్ రైతులకు మాటిచ్చిన రూ.20,000 సాయం చెల్లించాలని డిమాండ్ చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+