Ananth Ambani Marriage: బిలియనీర్ రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభంవంగా జరుగుతున్నాయి. దీనికి దేశవిదేశాల నుంచి అతిరథులు వస్తున్న వేళ ముంబై నగరం బిజీబిజీగా మారిపోయింది.
దీంతో ముంబై మహానగరంలో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల గ్రాండ్ వెడ్డింగ్ కోసం ట్రాఫిక్ మళ్లింపులు, పరిమితులు కొనసాగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(BKC)లోని అనేక కార్యాలయాలు జూలై 15 వరకు ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరాయి. వాస్తవానికి రేపు అంటే జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్-రాధికల వివాహం జరుగుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.

రేపు గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత.. జూలై 13న శుభ ఆశీర్వాదం, జూలై 14న మంగళ్ ఉత్సవ్ జరుగుతాయని తెలుస్తోంది. ఈ వివహానికి దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు వస్తున్న వేళ ముఖేష్ అంబానీ గెస్ట్స్ కోసం ఇప్పటికే ఐటీసీ, ది లలిత్, తాజ్ వంటి ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాటుకు బుకింగ్స్ చేశారు. దీంతో ముంబైలో హోటల్ ఆక్యుపెన్సీ, ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో బీకేసీలోని లగ్జరీ హోటళ్లు ఒక్క రాత్రికి గదికి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ముంబైలోని హోటల్స్ ట్రైడెంట్, ఒబెరాయ్‌లో వారి వెబ్‌సైట్‌ల ప్రకారం జూలై 10-14 వరకు గదులు అందుబాటులో లేవని వెల్లడైంది.
అనంత్ అంబానీ వివాహ వేడుకకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కిమ్ కర్దర్శియాన్, ఖోలీ కర్దాషియాన్, యూకే మాజీ పీఎం బోరిస్ జాన్సన్, లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జేమ్స్ టైక్లెట్, ప్రెట్ ఎ మ్యాంగర్ సీఈవో పనో క్రిస్టౌ తదితరులు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ జానపద గాయకుడు మామే ఖాన్‌కు ఆహ్వానం అందడమే కాకుండా జూలై 12న జరిగే వివాహ వేడుకలో కూడా పాల్గొననున్నారు. ఈ వార్తను ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ధృవీకరించారు.
ఇదిలావుండగా అనంత్-రాధిక వివాహానికి ముందు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబానీలు మంగళవారం తమ నివాసం యాంటిలియాలో సరదాగా హల్దీ వేడుకను నిర్వహించారు. జూలై 5న కుటుంబం సంగీత వేడుకను నిర్వహించింది. దీనికి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. గ్లోబల్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ కూడా ఈ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవర్ కళ్యాణ్ అనంత్ అంబానీ వివాహవేడుకకు హాజరవుతారా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications