Reliance Employees: ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ పెళ్లితే తాను ఎంత తెలివైన వ్యక్తో మరోసారి రుజువు చేసుకున్నారు. వాస్తవానికి చాలా మంది సంపన్నులు తమ పిల్లల పెళ్లిళ్లు విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ గ్రాండ్ గా చేస్తుంటారు. వీటికి భిన్నంగా రిలయన్స్ అధినేత తన కుమారుడి పెళ్లి లోకల్‌గా ముంబైలో జరిపించి.. రిలయన్స్ బ్రాండ్ ఇమేజ్‌కి గ్లోబల్ ప్రమోషన్ అందేలా చేశారు. అంతర్జాతీయంగా వార్తా సంస్థలు అంబానీ ఇంట పెళ్లి ఈవెంట్ కవర్ చేసేలా చేసింది.
ఈ క్రమంలో తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సైతం ముఖేష్ అంబానీ బహుమతి అందించారు. ఆనంద్ అంబానీ పెళ్లి సందర్భంగా రిలయన్స్ ఉద్యోగులకు ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ అందుకున్నారు. ముఖేష్ అంబానీ కుమారుడు ఆనంద్ అంబానీ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం పూర్తైంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో నిన్న పెళ్లి వేడుక జరిగింది. మూడు రోజులు కొనసాగిన పెళ్లి వేడుకలు మెుత్తానికి ఇటీవల ముగిశాయి.

ఈ బహుమతి గురించి రిలయన్స్‌కు చెందిన ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. ఆనంద్ అంబానీ-రాధిక మర్చండ్ వెడ్డింగ్ ఎరుపు రంగు గిఫ్ట్ బాక్స్‌పై బంగారు అక్షరాలతో చెక్కబడింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ నుంచి శుభాకాంక్షలు అని దానిపై ముద్రించబడింది.గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో.. వెండి నాణెం, స్వీట్లతో పాటు హల్దిరామ్స్ హాట్ ఉన్నాయి.
మార్చిలో గుజరాత్‌లో అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్‌ని ఘనంగా నిర్వహించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వివిధ అంతర్జాతీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఐటీ కంపెనీల అధినేతలు హాజరయ్యారు. దీని తర్వాత జూన్ 1న యూరప్‌లోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో మరో ఈవెంట్ జరిగింది. వీటి తర్వాత తాజాగా ముంబైలో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి అంబానీ కుటుంబం అతిథుల కోసం ప్రత్యేకంగా విమానాలను కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మూడు ఫాల్కన్ జెట్ విమానాలు, 100 విమానాలను లీజుకు తీసుకున్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications