Adani-Hindenburg తుఫానులో చిక్కుకున్న కోటక్ బ్యాంక్.. పెద్ద కథే నడుస్తోంది..!!
Kotak Mahindra Bank: స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కొత్త చర్చకు తెరలేపింది. గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల ట్రేడింగ్ పై పలు ఆరోపణలు చేసిన తర్వాత తాజాగా మార్కెట్లలో మరో తుఫాను చెలరేగింది.
తాజాగా దేశీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ అదానీ కంపెనీలపై రిపోర్టుతో భారతీయ నిబంధనలు హిండెన్‌బర్గ్ ఉల్లంఘించిందంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమెరికా షార్ట్ సెల్లర్ మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రైవేట్ బ్యాంక్, ఇతర భారతీయ వ్యాపారవేత్తలను రక్షించడానికి ప్రయత్నిస్తోందంటూ ఎదురు దాడికి దిగింది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ చిక్కుకోవటంతో ఇంట్రాడేలో 2 శాతం మేర నేడు నష్టపోయాయి.

అదానీ స్టాక్‌లను తగ్గించడంలో కోటక్ బ్యాంక్ అనుబంధ ఫండ్ ప్రమేయాన్ని వెల్లడించడంలో సెబీ సెబీ వెల్లడించటం లేదని గోప్యతను పాటిస్తోందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ స్పందిస్తూ.. కోటక్ మహీంద్రా బ్యాంక్ యూనిట్ అయిన కోటక్ మహీంద్రా (ఇంటర్నేషనల్) లిమిటెడ్, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన కె-ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ లిమిటెడ్‌లో ఎప్పుడూ క్లయింట్ లేదా పెట్టుబడిదారుగా ఉండలేదని పేర్కొంది. అయితే అదానీకి చెందిన షేర్లను కింగ్‌డన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కోసం షార్ట్ చేసినట్లు వెల్లడించింది.
తాజాగా హిండెన్‌బర్గ్ తమ పేరును బహిర్గతం చేయటంతో తాము బస్సు కింద పడ్డట్లుగా మారిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఫండ్ మేనేజర్ షేర్లు ఈక్విటీ ధర కంటే 200 రెట్లు అధిక రేటు వద్ద ఉన్నప్పుడు విక్రయించాలని నిర్ణయించినట్లయితే దానిని తాము మ్యానిపులేషన్ ట్రేడ్ అని ఎలా గుర్తించగలని ఆయన పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్ తన ఇన్వెస్టర్లలో భాగస్వామిగా ఉన్నట్లు తమకు తెలియదని అన్నారు.


Click it and Unblock the Notifications