Adani Green Shares: చెడులో కూడా మంచి ఉంటుంది అన్న మాట మన పూర్వీకులు చెబుతూనే ఉంటారు. ప్రస్తుతం ఇది అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి 100 శాతం సూట్ అవుతోంది. అదానీ తన సోలార్ వ్యాపారం కోసం అనేక రాష్ట్రాల్లో ఉన్నతాధికారులకు భారీగా లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చిన తర్వాతి నుంచి అదానీకి చెందిన లిస్టెడ్ స్టాక్స్ ప్రధానంగా ఇందులో ఇరుక్కున్న కంపెనీ షేర్లు మెగా ర్యాలీని చూస్తున్నాయి.
ముందుగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ షేర్లు తమ బలమైన ర్యాలీని కొనసాగిస్తున్నాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో అదానీ గ్రీన్ కంపెనీ షేర్లలోని దూకుడు ర్యాలీ నేడు కూడా కొనసాగింది. దీంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు దాదాపు 9 శాతానికి పైగా పెరిగి రూ.1447.70 స్థాయికి చేరుకున్నాయి. దీంతో అదానీ స్టాక్ కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే పెట్టుబడిదారులకు 61 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. అయితే దీనికి కారణంగా గ్రూప్ సీఎఫ్ఓ జుగేషీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ మరియు జూన్ మధ్య కాలంలో రద్దు చేసిన డాలర్ బాండ్‌ను పునరుద్ధరించడాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇతర గ్రూప్ సంస్థలు కూడా ఏడాదిలోపు పబ్లిక్ బాండ్ విక్రయాలను అన్వేషించవచ్చని సింగ్ స్పష్టం చేశారు.

అయితే దీనికి కొద్దిరోజుల ముందు అదానీ గ్రీన్ కంపెనీపై అమెరికాలో లంచాల ఆరోపణలు దర్యాప్తులో రావటంతో కంపెనీ తన 600 మిలియన్ డాలర్ల బాండ్ విక్రయాలను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గౌతమ్ అదానీ, ఇతర గ్రూప్ ఇతర గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లపై ఎలాంటి లంచం ఆరోపణలు లేవని భారతీయ కంపెనీ పేర్కొంది. ఇదే క్రమంలో అదానీ గ్రూప్ పోర్ట్‌ఫోలియో కంపెనీలు రాబోయే 12 నెలల వరకు అన్ని రుణ సేవల అవసరాలను కవర్ చేయడానికి తగినంత లిక్విడిటీని కలిగి ఉన్నాయని సీఎఫ్ఓ వెల్లడించారు. దీంతో అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ షేర్లు రికార్డు సమయంలోనే లంచాల ఆరోపణలతో చూసిన నష్టాలను తిరిగి కవర్ చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ అమెరికా కోర్టు ఆరోపణలను ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్..
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ అదానీ గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ హవా మాత్రం బులిష్‍గానే కొనసాగుతోంది. APSEZ ఇన్వెస్టర్ డే 2024లో పాల్గొన్న బ్రోకరేజ్‌లు బలమైన వృద్ధి అంచనాల మధ్య అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ షేర్లకు 63 శాతం వరకు పెరగవచ్చని తమ టార్గెట్ ధరలను అందించాయి. ఈ క్రమంలో నువామా 'అవుట్‌పెర్ఫార్మ్' రేటింగ్ ఇస్తూ షేర్ టార్గెట్ ధరను రూ.1,960కి పెంచింది. అలాగే కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ షేర్లకు కొనుగోలు రేటింగ్ ఇస్తూ రూ.1,630 టార్గెట్ ధరగా పేర్కొంది. అలాగే మోతీలాల్ ఓస్వాల్ అదానీ పోర్ట్స్ స్టాక్ టార్గెట్ ధరను రూ.1,530గా ఉంచుతూ బై రేటింగ్ అందించింది. నేడు ఇంట్రాడేలో ఉదయం 12 గంటల సమయంలో అదానీ పోర్ట్స్ స్టాక్ ధర రూ.1196.60 వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications