Lottery: అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనని చెప్పుకోవాలి. టైమ్ వస్తే నిమిషాల్లో ధనవంతులు కావచ్చనడానికి ఇదే సరైన ఉదాహరణ. సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి అచ్చం ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అసలీ తలరాతను మార్చిన లాటరీ జాక్‌పాట్ గురించి ఇప్పుడు తెలుసుకుంది.

రూ.2 కోట్లు గెలుచుకున్న వ్యక్తి..
అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ వ్యక్తి సెలవుల్లో తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. సెలవులో ఉన్నప్పుడు అతడు స్క్రాచ్ ఆఫ్ లాటరీ టికెట్ కొన్నాడు. 58 ఏళ్ల వయస్సులో ఈ వ్యక్తికి రూ.2 కోట్లు గెలుచుకోవటంతో ఒక్కసారిగా అదృష్టం వల్ల జీవితమే మారిపోయింది.

స్క్రాచ్‌ఆఫ్ లాటరీ..
మేరీల్యాండ్ లాటరీ అధికారుల ప్రకారం.. ఒక వ్యక్తి అతని భార్యతో సెలవును సరదాగా గడిపేందుకు ఓషన్ సిటీకి వచ్చారు. భార్యను హోటల్‌లో పడుకోబెట్టి వాకింగ్‌కు వెళ్లినప్పుడు దుకాణానికి వెళ్లాడు. అక్కడ అనుకోకుండా స్క్రాచ్ ఆఫ్ లాటరీ టికెట్ కొన్నాడు. కేవలం 10 డాలర్లు వెచ్చించిన అతడికి ఫస్ట్ ఫ్రైజ్ లో రెండు కోట్లు దక్కాయి.

నమ్మలేకపోయిన భార్య..
జాక్‌పాట్ గెలుపొందడం గురించి తెలుసుకున్న అతను తన భార్యతో చెప్పేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. నిద్రలో ఉన్న ఆమెకు ఈ విషయం చెప్పగా మెుదట నమ్మలేదు. కానీ టిక్కెట్టు చూడగానే ఆనందంతో కేకలు వేసింది. ఈ వ్యక్తి గతంలో వర్చువల్ హార్స్ రేసింగ్ గేమ్‌లో 10,000 డాలర్లను గెలుచుకున్నాడు. ఈ డబ్బును తన పిల్లలకు కొంత ఇస్తానని, మిగిలినది రిటైర్ మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటానని వెల్లడించాడు.

ఆగష్టు 15 వాషింగ్టన్ లాటరీ..
ఇటీవల ఒక జంట వాషింగ్టన్ లాటరీ గేమ్ నుంచి సుమారు 30 వేల రూపాయలు గెలుచుకున్నట్లు భావించారు. కానీ.. వారి అసలు వారు గెలుచుకున్న మెుత్తం చాలా పెద్దదని తరువాత తెలుసుకుని ఆశ్చర్యపోయారు. లిన్‌వుడ్ జంట జూలైలో ఫ్రెడ్ మేయర్‌లో హిట్ 5 గేమ్‌కు టిక్కెట్‌లను కొనుగోలు చేశారు. వాషింగ్టన్ లాటరీ నుంచి ఆగష్టు 15 విడుదలైన సమాచారం ప్రకారం.. అసలు లాటరీ మెుత్తం రూ.2.86 కోట్లని లాటరీ నిర్వహకులు వెల్లడించారు.
More From GoodReturns

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్‌లో ఉన్నారేమో చూసుకోండి!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications