US Shutdown: అమెరికా షట్‌డౌన్‌కు కౌంట్‌డౌన్ షురూ.. కీలక డేటా విడుదల లేనట్లే..!
US Shutdown: సెప్టెంబరు నెలాఖరుతో అమెరికా ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానున్న ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభానికి నిధుల కొరత గుదిబండగా మారనుంది. మరో 5 రోజులు ఇలాగే కొనసాగితే US ప్రభుత్వం షట్‌డౌన్ అయ్యే ప్రమాదమూ ఉంది.
రిపబ్లికన్ పార్టీ అభ్యంతరాల నడుమ.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ఫెడరల్ ఏజెన్సీ కార్యకలాపాలకు నిధులు కేటాయించడం ఆలస్యం అవుతోంది. కాంగ్రెస్ ఇప్పటివరకు ఎటువంటి ఆర్థిక బిల్లులను ఆమోదించకపోవడంతో రోజురోజుకీ టెన్షన్ పెరుగుతోంది. తద్వారా ఆదివారం షట్ డౌన్ అవకాశాలు మరింత బలపడుతున్నాయి.

ఈ కారణంగానే చట్టసభలకు, పెట్టుబడిదారులకు కీలకమైన ఎంప్లాయిమెంట్, ద్రవ్యోల్బణ నివేదికల రిలీజ్ నిలిపివేయబడుతుందని ఓ అమెరికా ప్రభుత్వాధికారి తెలిపారు. US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో రిపబ్లికన్స్ హహా కొనసాగుతుండగా.. ఖర్చుల్లో భారీగా కోతలు విధించాలని వారు పట్టుబడుతున్నారు. దీంతో ఆ బిల్లు కాస్తా చట్టంగా మారే అవకాశం కనిపించడం లేదు.
సాధారణంగా కార్మిక శాఖ తన నెలవారీ జాబ్ డేటాను అక్టోబరు 6న, CPI నివేదిక 12న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వీటి విడుదలకు అవకాశం కనిపించడం లేదు. 'ఒక సమస్య వల్ల బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుంది. షట్ డౌన్ లో భాగంగా సెప్టెంబర్ కు సంబంధించిన ఎంప్లాయ్ మెంట్, వినియోగదారుల ధరల సూచీ డేటా విడుదల చేయబడదు' అని బైడెన్ ప్రభుత్వాధికారి వెల్లడించారు.


Click it and Unblock the Notifications