అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు ఊహించని పరిమాణాన్ని ఎదుర్కొన్నాయి. తమపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధినేతలు అమెరికా చట్టసభల ముందు హాజరయ్యారు. టెక్నాలజీ దిగ్గజాల హవా నడుస్తోన్న నేపథ్యంలో ఆయా కంపెనీల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అమెరికా చట్టసభలు విచారణ మొదలుపెట్టాయి. ఇందుకు అమెరికా హౌజ్ కమిటీ ప్రత్యేక ఉప కమిటీని నియమించింది.

విచారణకు దిగ్గజ కంపెనీల అధినేతలు
ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ కమిటీ టెక్ దిగ్గజ కంపెనీలపై నేడు విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ విచారణలో అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విచారణకు హాజరవుతున్నారు. ఈ సమయంలో అమెరికన్ చట్టాలకు అనుగుణంగా ఎదిగిన తీరును వివరించారు. నూతన ఆవిష్కరణలతో తమ కంపెనీలు పోటీ వాతావరణంలో మనుగడ సాగిస్తున్న తీరును వివరిస్తున్నారు.

పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు
ఈ నలుగురు దిగ్గజ కంపెనీల అధినేతలను డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ప్రశ్నించారు. ప్యానల్‌లో పదిహేను మంది సభ్యులు ఉన్నారు. వీరిపై ఏకధాటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. మార్కెట్లో ఆధిపత్యం కోసం అమలు చేసిన వ్యూహాలను ప్రశ్నించారు. దాదాపు ఐదు గంటల పాటు ఈ నలుగురినీ ప్రశ్నించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది. ఈ దిగ్గజ కంపెనీల అధిపతులు పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ఈ కమిటీ నుండి టెక్ దిగ్గజాలకు ఊహించని ప్రశ్నలు వచ్చాయి.

కంటెంట్‌ను దొంగిలిస్తున్నారని
గౌరవభావం, మర్యాదతో సమాధానం ఇస్తున్నామని, ఎలాంటి వాస్తవాలు దాచడం లేదని కుక్ తెలిపారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ని ప్యానెల్ నిలదీసింది. ఇతర బిజినెస్ సంస్థల నుండి కంటెంట్‌ను దొంగిలిస్తున్నారని గూగుల్ పైన ఆరోపణలు చేశారు. సమగ్ర వివరాలు తెలుసుకొని, సమాధానం ఇస్తామని సుందర్ పిచాయ్ తెలిపారు.
కొన్ని ఖరీదైన వస్తువులకు సంబంధించిన నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారని విన్నానని, అయితే ఇందులో డ్రాగన్ ప్రభుత్వం ప్రమేయం ఉందో లేదో తెలియదని అమెజాన్ బెజోస్ చెప్పారు.


Click it and Unblock the Notifications