భారత్‌పై అమెరికన్ ఇన్వెస్టర్ షాకింగ్ కామెంట్స్.. మోదీని ఆయనతో పోల్చిన రే డాలియో..
ఎక్కడ చూసినా ఇప్పుడు ఇండియానే హాట్ టాపిక్.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల నుంచి అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్ల వరకు అంతా భారత్ వృద్ధిని ఆకాశానికెత్తేస్తున్నారు. ప్రముఖ అమెరికన్ ఇన్వెస్టర్ అయితే మరో అండుగు ముందేకేసి షాకింగ్ కామెంట్స్ చేశారు.
భారత్ ఎదుగుదలను ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోలేదని ప్రముఖ అమెరికన్ ఇన్వెస్టర్, బిలియనీర్ రే డాలియో తెలిపారు. 1984లో చైనా ఉన్న పరిస్థితిలో ప్రస్తుతం ఇండియా ఉన్నట్లు చెప్పారు. ఆర్థిక పరివర్తన దశలో భారత్ ఉన్నట్లు భావిస్తున్నానన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీని నాటి చైనా అధినేత డెంగ్ జియావోపింగ్‌తో పోల్చారు.

అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని UCLA క్యాంపస్‌లో జరిగిన ఆల్-ఇన్ సమ్మిట్ 2023లో బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకులు రే డాలియో పాల్గొన్నారు.
ఇందులో భారత్ వృద్ధి సామర్థ్యంపై తన అంచనాలను పంచుకున్నారు. 10 ఏళ్ల వృద్ధి రేటు అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 దేశాలతో పోలిస్తే ఇండియా అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు.
ప్రధాని మోదీ నాయకత్వం భారత్ లో భారీ సంస్కరణలకు నాంది పలికిందన్నారు. ఆయన హయాంలో దేశం అభివృద్ధి, సృజనాత్మకతలను ఆవిష్కరించిందని కొనియాడారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటలైజేషన్ వంటి అనేక ఆర్థిక సంస్కరణలు ఇవాళ భారత్ ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అంచనా వేశారు. అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలతో పోలిస్తే యుద్ధాల జోలికి పోని భారత్ వంటి దేశాలు ఆర్థిక వృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు.


Click it and Unblock the Notifications