భారీగా తగ్గబోతున్న బంగారం ధరలు, అమెరికాకు షాకిచ్చిన స్విస్.. దెబ్బకు దిగొచ్చిన ట్రంప్

ఇది పసిడి ప్రియులు ఎగిరి గంతేసే వార్త.. బంగారం ధర తగ్గేదిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు కడ్డీలపై విధించిన సుంకాలను మినహాయించేందుకు ఒక కీలక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించిన సమాచారం.. బ్లూమ్‌బెర్గ్ ఆధారంగా Investing.com ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇటీవల బంగారం ధరలపై గందరగోళం, అనిశ్చితి కారణంగా చరిత్రలోనే అత్యధిక స్థాయికి దాని ధర చేరుకోవడంతో.. ప్రపంచ మార్కెట్ ఈ నిర్ణయాన్ని ఆసక్తిగా గమనిస్తోంది.

ఈ మధ్య US కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్.. కామెక్స్‌లో అత్యధికంగా వ్యాపారం జరిగే బంగారం కాబట్టి.. ఒక కిలోగ్రాము, 100 ఔన్సుల బులియన్ బార్‌లపై దేశ-నిర్దిష్ట సుంకం విధించనుందని ప్రకటించింది. దీని ఫలితంగా..ప్రపంచ బంగారు శుద్ధి పరిశ్రమలో నంబర్ వన్ గా ఉన్న స్విట్జర్లాండ్ నుండి US‌కు జరిగే దిగుమతులు..దాదాపు 39 శాతం వరకు సుంక భారం ఎదుర్కోవలసి వస్తుందనే ఆందోళనలు పెరిగాయి. దీంతో స్విస్ టారిఫ్ ఆందోళనతో బంగారం ఎగుమతులను అమెరికాకు నిలిపివేసింది. దెబ్బకు దిగొచ్చిన అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.

America gold bars tariff exemption US gold trade news gold market turmoil US import duty gold US economy gold policy gold price news gold bars US tariff cut American gold market gold import exemption gold investment news

స్విట్జర్లాండ్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల US‌కు బంగారం సరఫరా చాలావరకు నిలిచిపోయింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. కొన్ని స్విస్ రిఫైనరీలు అనిశ్చితి కారణంగా తమ సరఫరాలను తాత్కాలికంగా ఆపివేశాయి. ఇదే విధమైన సుంకాలు కొనసాగితే.. కామెక్స్, లండన్ Gold ధరల మధ్య వ్యత్యాసం పెరిగే అవకాశం ఉంది.

తద్వారా కొత్త ఆర్బిట్రేజ్ అవకాశాలు సృష్టించవచ్చని బంగారం నిపుణులు భావిస్తున్నారు. గత సంవత్సరం స్విట్జర్లాండ్ .. అమెరికాకు 61.5 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఎగుమతి చేసింది. ఇందులో ఎక్కువగా ఒక కిలో బంగారు కడ్డీలు ఉన్నాయి. ఇప్పుడు 39 శాతం సుంకం విధిస్తే.. అదనపు ఖర్చు 24 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు స్విస్ అధికారులు వాషింగ్టన్‌తో చర్చలు జరుపుతున్నారు.

ప్రతిపాదిత మినహాయింపు వార్తలు బయటకు వచ్చిన వెంటనే, US బంగారు ఫ్యూచర్లు ఔన్సుకు 3534.10 డాలర్ కంటే తక్కువగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా..బంగారు కడ్డీలు, ఇతర ప్రత్యేక ఉత్పత్తులపై సుంకాల విధానాన్ని స్పష్టం చేసేందుకు తాజా కార్యనిర్వాహక ఉత్తర్వును సిద్ధం చేస్తోంది. మార్కెట్‌లో ఉన్న అనిశ్చితి తగ్గిపోతుందనే అంచనాలతో బంగారం ట్రేడర్లు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

ప్రపంచ మార్కెట్‌లో చెలరేగిన ఈ ప్రభావం భారతదేశంపైన కూడా పడింది. ఈ మధ్య కాలంలో ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు.. US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత అంచనాల నేపథ్యంలో.. దేశీయ బంగారం ధరలు లక్ష రూపాయల మార్కును దాటాయి. దేశంలో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1 లక్ష దాటింది. ఈ పెరుగుదల.. పెట్టుబడిదారులలో బంగారం పట్ల ఆసక్తిని మరింతగా పెంచుతోంది.

సామాన్యులకు ఇది భారాన్ని మిగిలిస్తోంది. ఆర్థిక విశ్లేషకుల ప్రకారం.. అమెరికా సుంక మినహాయింపు నిర్ణయం కనుక తుది రూపం దాల్చితే.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం వాణిజ్యం మళ్లీ స్థిరపడే అవకాశం ఉంది. అయితే.. ఇదొక్కటే కాకుండా.. భవిష్యత్ ధరలు ప్రపంచ రాజకీయ పరిణామాలు, వడ్డీ రేటు మార్పులు, పెట్టుబడి డిమాండ్‌పై కూడా ఆధారపడి ఉంటాయి.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+