అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సుంకాల కారణంగా చైనా ఇబ్బందుల్లో పడింది. తాజాగా ట్రంప్ చైనాపై సుంకాలను 125%కి పెంచారు. దింతో అమెరికా చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 125% సుంకం ఛార్జ్ చేస్తుంది. ఈ కారణంగా చైనా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సి రావొచ్చు. చైనా అమెరికాకు ఎలక్ట్రానిక్ భాగాలతో సహా పెద్ద సంఖ్యలో ఉత్పత్తులను విక్రయిస్తుంది, ఇవి చైనా ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది, కానీ ఇప్పుడు కష్టంగా మారింది.

5% డిస్కౌంట్ ఆఫర్: అమెరికన్ మార్కెట్ కఠినంగా మారిన తర్వాత చైనా కంపెనీలు ఇప్పుడు భారతదేశంపై దృష్టి పెట్టాయి. దింతో చైనా కంపెనీలు భారతదేశానికి మరిన్ని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ET నివేదిక ప్రకారం, అమెరికాతో సుంకాల యుద్ధంతో ఆందోళన చెందుతున్న చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు ఇప్పుడు భారతదేశానికి మరిన్ని డిస్కౌంట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.
చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు భారతీయ కంపెనీలకు మొత్తం ఎగుమతులపై 5% డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ విభాగంలో ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉన్నందున ఈ డిస్కౌంట్ పెద్ద రిలీఫ్ అవుతుంది. చైనా నుండి వచ్చే ఎలక్ట్రానిక్స్ భాగాలను రిఫ్రిజిరేటర్లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులలో ఉపయోగిస్తారు. డిమాండ్ పెంచడానికి భారతీయ తయారీదారులు చైనా నుండి అందుకుంటున్న డిస్కౌంట్ల ప్రయోజనాలను కస్టమర్లకి అందించవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే రాబోయే రోజుల్లో రిఫ్రిజిరేటర్ల నుండి స్మార్ట్‌ఫోన్‌ల వరకు ప్రతిదీ చౌకగా మారవచ్చు.
అమెరికా తర్వాత చైనాకు భారతదేశం అతిపెద్ద మార్కెట్ కాబట్టి చైనా అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, బొమ్మలు, దుస్తులు, వీడియో గేమ్‌లు, లిథియం-అయాన్ బ్యాటరీలు, హీటర్లు, ఫర్నిచర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఆక్సెసోరిస్, వైద్య పరికరాల వరకు చాలా ఉత్పత్తులను విక్రయిస్తుంది. అమెరికా భారీ సుంకాలను విధిస్తుండటంతో ఇప్పుడు ఆ దేశం లాభాలను ఇచ్చే మార్కెట్‌గా ఉండదు. ఈ పరిస్థితిలో చైనా కంపెనీలు భారతదేశంతో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటాయి.
చైనా అమెరికా సుంకాల పై నిరంతరం స్పందిస్తోంది. అమెరికా విధించిన 104% సుంకానికి ప్రతిస్పందనగా, అమెరికా వస్తువులపై సుంకాన్ని చైనా 84%కి పెంచింది. దీనిపై ఆగ్రహించిన డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై 125% సుంకాన్ని ప్రకటించారు. దీని వలన చైనీస్, అమెరికన్ ప్రజలు ఒకరి వస్తువులను ఒకరు కొనడానికి గతంలో కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది లేదా వేరే అల్టర్నేటివ్ చూసుకోవాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications