క్రిప్టోకరెన్సీకి మంచి రోజులు.. త్వరలోనే నిర్ణయం.. వీరికి పండగే ఇక..

గత నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా
డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ తరుణంలో అమెరికా క్రిప్టోకరెన్సీకి జాతీయ ప్రాధాన్యత ఇచ్చే ఆర్డర్‌ను జారీ చేయాలని యోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

ఈ చర్య పాలసి మార్పును సూచిస్తుందని అలాగే ప్రభుత్వ నిర్ణయాలను రూపొందించడంలో క్రిప్టో పరిశ్రమకు మరింత ప్రముఖ పాత్రను అందించాలని భావిస్తున్నారు. నివేదికలో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఆర్డర్ క్రిప్టోకరెన్సీకి జాతీయ హోదా సూచిస్తుంది, పరిశ్రమతో సహకరించడానికి ప్రభుత్వ ఏజెన్సీలను ప్రోత్సహిస్తుంది. దీనికితోడు క్రిప్టోకరెన్సీ సలహా మండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నేడు ఉదయం బిట్‌కాయిన్ $101,021.39 మార్కెట్ క్యాప్‌తో $2 ట్రిలియన్ల వద్ద ట్రేడవుతోంది.

america new president Donald Trump plans to make cryptocurrency a national priority Report

క్రిప్టో పరిశ్రమ ప్రభావం
డోనాల్డ్ ట్రంప్ ఇనాగురాల్ కమిటీకి కాయిన్‌బేస్, రిపుల్ వంటి ప్రముఖ సంస్థల నుండి విరాళాలతో సహా క్రిప్టోకరెన్సీ పరిశ్రమ నుండి గొప్ప సపోర్ట్ అందుకున్నారు. అతని రెండవ పదవీకాలం ప్రారంభానికి కొద్ది రోజుల ముందు అంటే శుక్రవారం వైట్ హౌస్‌లో పరిశ్రమ అడ్మినిస్ట్రేషన్‌తో సంబంధాలను జరుపుకుంటూ వాషింగ్టన్‌లో క్రిప్టో బాల్ ప్రారంభం చేసునేందుకు సిద్ధమైంది. మాజీ అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో ఎన్నో నియంత్రణ సవాళ్లను ఎదుర్కొన్న క్రిప్టో రంగానికి ఈ చొరవ భారీ మార్పును సూచిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)తో సహా ఫెడరల్ ఏజెన్సీలు ఇటీవలి సంవత్సరాలలో క్రిప్టో కంపెనీలకు వ్యతిరేకంగా 100 కంటే పైగా అమలు చర్యలను ప్రారంభించాయి.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు డిజిటల్ ఆస్తులపై వాటి విధానాలను సమీక్షించాల్సిన ఆదేశాలు ఉండవచ్చు. క్రిప్టోకరెన్సీ సంస్థలకు సంబంధించిన వాజ్యం గురించి కూడా చర్చ జరుగుతోంది అని సంబంధిత వర్గాలు బ్లూమ్‌బెర్గ్‌కి తెలిపాయి. అయితే Binance Holdings Ltd. అండ్ Ripple Labs Inc. వంటి ప్రముఖ కంపెనీలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలను నిలిపివేయవచ్చు, ఈ చర్యను పరిశ్రమ అత్యంత ప్రాధాన్యతగా పరిగణించింది. పరిశీలనలో ఉన్న మరో కీలక అంశం జాతీయ బిట్‌కాయిన్ స్టాక్‌పైల్‌ను సృష్టించడం అని నివేదిక పేర్కొంది.

అనలిటిక్స్ సంస్థ అర్ఖమ్ ప్రకారం యుఎస్ ప్రభుత్వం వద్ద ప్రస్తుతం దాదాపు $20 బిలియన్ల విలువైన బిట్‌కాయిన్స్ ఉన్నాయి, వీటిని వివిధ పరిశోధనల సమయంలో రికవరీ చేసింది. నవంబర్ ఎన్నికల సమయం నుండి బిట్‌కాయిన్ ధర దాదాపు 50% పెరిగింది. బిట్‌కాయిన్ 2024లో అద్భుతమైన వృద్ధిని సాధించింది, దింతో దాని విలువ సంవత్సరంలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. కాయిన్‌బేస్ గ్లోబల్ ఇంక్‌లో యుఎస్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ కారా కాల్వెర్ట్ ట్రంప్ చర్య ప్రాముఖ్యతపై స్పందించారు.

జో బైడెన్ సమయంలో అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ USలో క్రిప్టోకరెన్సీ పరిశ్రమ వృద్ధి చెందుతూనే ఉంది. BlackRock Inc.తో సహా ప్రముఖ ఆర్థిక సంస్థలు స్పాట్ బిట్‌కాయిన్, ఈథర్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)ను ప్రారంభించాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+