AMD: సెమీ కండక్టర్స్, చిప్స్ కోసం ఇప్పటివరకు ప్రపంచ దేశాలన్నీ పొరుగుదేశం చైనాపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే మారుతున్న పరిస్థితులు, ఇండియాలో పెట్టుబడి అవకాశాల మెరుగుదల వల్ల పలు కంపెనీలు భారత్ లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశాల్లోని ప్రముఖ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.
అమెరికాకు చెందిన చిప్‌మేకర్ అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్ (AMD) ఇండియాలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో 400 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. గాంధీనగర్‌లో జరిగిన సెమికాన్ ఇండియా 2023 రెండవ ఎడిషన్ వేదికగా AMD గ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్‌మాస్టర్ ఈ విషయాన్ని ప్రకటించారు.

కర్ణాటకలోని బెంగళూరులో కొత్త క్యాంపస్‌ని ఏర్పాటు చేయనున్నట్లు AMD తెలిపింది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీకి చెందిన అతిపెద్ద డిజైన్ సెంటర్‌గా ఇది పనిచేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా 2028 చివరి నాటికి దాదాపు 3 వేల కొత్త ఇంజనీరింగ్ జాబ్స్ క్రియేట్ చేయనున్నట్లు వెల్లడించింది.
2001లో AMD తన మొదటి సైట్‌ను న్యూఢిల్లీలో నెలకొల్పి భారత్ లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. అందులో ప్రస్తుతం 6 వేలకు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ముంబై సహా 9 ప్రాంతాల్లో సంస్థ విస్తరించి ఉంది. దేశంలో AMD అతిపెద్ద R&D డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయడాన్ని ఎలక్ట్రానిక్స్ & IT శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications