Ambuja Cement: దాదాపు మూడు వారాలుగా అదానీ గ్రూప్ కంపెనీల పరిస్థితి అస్సలు ఏమాత్రం బాలేదు. గ్రూప్ వ్యాపారాలపై వచ్చిన అనేక ఆరోపణల నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్ల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు అందరూ అదానీకి దూరంగా జరుగుతూ ఉన్నారు. పైగా ఈ అంశం దేశంలో రాజకీయ అస్ర్తంగా కూడా మారిపోయింది. చివరికి యవ్వారం కోర్టు మెట్లు కూడా ఎక్కింది.

గొప్ప విజయం..
పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ప్రస్తుత తరుణంలో అదానీ మంచి జాక్ పాట్ కొట్టారు. ఇది ఆయన కొత్తగా కొనుగోలు చేసిన సిమెంట్ వ్యాపారానికి చాలా కీలకమైనది. అదానీకి చెందిన అంబుజా సిమెంట్ లిమిటెడ్ భారీ డీల్‌ను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒడిశాలోని ఉస్కల్‌వాగు సున్నపురాయి బ్లాక్‌కు ప్రాధాన్య బిడ్డర్‌గా అదానీ కంపెనీ ఎంపికైనట్లు కంపెనీ తెలిపింది.

సున్నపురాయి గనులు..
మల్కన్‌గిరి జిల్లాలో ఉన్న సున్నపురాయి బ్లాక్ కోసం ఒడిశా ప్రభుత్వం ఈ-వేలం నిర్వహించింది. ఇందులో అదానీ గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్ కూడా బిడ్ దాఖలు చేసింది. అయితే బిడ్ ఎంతకు దాఖలు చేసిందనే విషయం వెల్లడికాలేదు. 547 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ బ్లాక్ లో మెుత్తం 141 మిలియన్ టన్నుల సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని అంచనా. బిడ్ పొందినట్లు అంబుజా సిమెంట్ స్టాక్ మార్కెట్ కు వెల్లడించింది.

అంబుజా స్టాక్..
బిడ్ గెలిచిన వార్త వెలువడటంతో అంబుజా సిమెంట్ స్టాక్ 3 శాతం మేర లాభపడింది. మధ్యాహ్నం 2.32 గంటల సమయంలో అంబుజా సిమెంట్స్ స్టాక్ ధర రూ.348.85 వద్ద ఉంది. హిండెన్ బెర్గ్ నివేదిక తర్వాత కంపెనీ స్టాక్ విలువ క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.598గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.274 వద్ద ఉంది. ఏడాది ప్రాతిపధికన స్టాక్ దాదాపు 34 శాతం మేర మార్కెట్ విలువను కోల్పోయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications