Multibagger Stock: స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించాలంటే సరైన స్టాక్స్ ఎంపిక చాలా ముఖ్యం. సరైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. స్టాక్ మార్కెట్‌లో పలు కంపెనీల స్టాక్స్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. కేవలం ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు బంపర్ రాబడిని అందించిన అటువంటి మల్టీబ్యాగర్ స్టాక్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ స్టాక్ గురించే. ఈ కంపెనీ FMCG రంగంలో అద్బుత పనితీరుతో మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు స్టాక్ 4,260 శాతం బలమైన రాబడిని అందించింది. శుక్రవారం షేర్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బీఎస్ఈలో రూ.572.05 స్థాయి వద్ద ముగిసింది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు ధనవంతులయ్యారు.

ఐదేళ్లలో రాబడులు ఇలా..
ఒక ఇన్వెస్టర్ ఐదేళ్ల క్రితం షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ.77.82 లక్షలకు చేరుకునేది. ఈ స్టాక్ గత 5 సంవత్సరాల్లో 7,682.99% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. అదే విధంగా ఏడాది కాలాన్ని పరిశీలిస్తే.. ఏకంగా 4,260 శాతం రిటర్న్స్ ఇచ్చింది. సెప్టెంబర్ 23, 2021న షేర్ ధర కేవలం రూ.13.12గా ఉంది. కానీ ప్రస్తుతం దీని షేర్ విలువ రూ.572.05కి చేరుకుంది. అంటే ఏడాది కిందట ఎవరైనా ఇన్వెస్టర్ ఇందులో లక్ష పెట్టుబడిగా పెట్టి ఉండే ఇప్పుడు వారు రూ.43.60 లక్షలు పొందేవారు.

నెలరోజుల క్రితం ఇన్వెస్ట్ చేస్తే..
గత ఒక నెల చార్ట్‌ను పరిశీలిస్తే.. ఆగస్టు 17న కంపెనీ షేరు రూ.205 స్థాయిలో ఉంది. అంటే కేవలం ఒక నెలలో షేరు రూ.366.35 లాభపడింది. ఇది కాకుండా.. 6 నెలల్లో స్టాక్ 1,829.34 శాతం లాభపడింది. ఈ కాలంలో షేరు రూ.542.40 లాభపడింది. అంటే కనీసం నెల రోజుల కిందట ఈ వంటనూనెల తయారీ కంపెనీలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఉండే పెట్టుబడి రెండింతలయ్యేది.

కంపెనీ చేసే వ్యాపారం వివరాలు..
అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ 1992లో అహ్మదాబాద్‌లో స్థాపించబడింది. అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆహార నూనెలను విక్రయిస్తుంది. అంకుర్ రిఫైండ్ కాటన్ సీడ్ ఆయిల్, అంకుర్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, అంకుర్ రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, అంకుర్ రిఫైండ్ కార్న్ ఆయిల్ కంపెనీ ఉత్పత్తులు. కంపెనీకి చంగోదర్‌లో 110 టన్నుల సామర్థ్యం కలిగిన రిఫైనరీ ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications