Reliance Jio: ప్రస్తుతం రిలయన్ జియో దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది. వాస్తవానికి జూన్ 2022లో రిలయన్స్ జియో డైరెక్టర్ పదవి నుంచి ముఖేష్ అంబానీ తప్పుకుని తన కుమారుడు ఆకాష్ అంబానీని చైర్మన్‌గా చేశారు. అలాగే చిన్న కుమారుడు అనంత్ అంబానీని జియో ప్లాట్ ఫారమ్ చైర్మన్‌గా నియమించారు.
ఆకాష్ అంబానీ టెలికాం రంగంలో తన తండ్రి స్థాపించిన జియో సంస్థను కొత్త శిఖరాలకు చేర్చి రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. దేశంలో ప్రజలకు అత్యంత ప్రియమైన ఆపరేటర్‌గా సేవలను అందిస్తోంది. దీంతో రిలయన్స్ జియో సరికొత్త రికార్డు సృష్టించింది. డేటా వినియోగం పరంగా భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ జియో ప్రపంచంలోనే నంబర్-1 స్థానంలో నిలిచింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ డేటా వినియోగంలో ప్రపంచంలోని చైనా కంపెనీలను అధిగమించింది. ఇదే విషయాన్ని జియో తన తాజా త్రైమాసిక ఫలితాల సమయంలో వెల్లడించింది. త్రైమాసికంలో జియో జియో నెట్‌వర్క్‌లో మొత్తం 4400 కోట్ల జీబీ డేటాను యూజర్లు ఖర్చు చేశారు.

డేటా వినియోగంలో జియో ప్రపంచవ్యాప్తంగా నంబర్-1గా నిలిచింది. ఇది అన్ని ఇతర కంపెనీలను వెనుకకు నెట్టివేసింది. ఈ క్రమంలో జియో పెద్ద చైనా కంపెనీలను కూడా ఓడించి డేటా పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. రిలయన్స్ జియోకు 49 కోట్ల మంది కస్టమర్లు ఉండగా.. కేవలం గత ఏడాది మాత్రమే 4 కోట్ల మంది జియో సేవలను కొత్తగా తీసుకోవటానికి చేరారు.
డేటా వినియోగంలో అత్యధికంగా ఉన్న గతంలో చైనా కంపెనీల పేరిట ఉండేది. అయితే ప్రస్తుతం జియో కస్టమర్లు ప్రతినెల సగటున 30.3 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. అంటే సగటున రోజుకు ఒక జీబీ కంటే ఎక్కువగానే వినియోగం ఉంది. జూన్ త్రైమాసికంలో జియో డేటా వినియోగం 32.8 శాతం పెరిగి 44 బిలియన్ గిగాబైట్‌లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ సంఖ్య 33.2 బిలియన్ గిగాబైట్‌లుగా ఉంది. ఇది జియోలో వేగంగా పెరుగుతున్న 5జీ వినియోగదారులకు అద్ధం పడుతోంది.
జియో అనేక ప్లాన్‌లను ప్రారంభించింది. ఇందులో అపరిమిత డేటాతో పాటు ఉచిత కాలింగ్ కూడా ఉన్నాయి. దీంతో రిలయన్స్ జియో చాలా త్వరగా దేశ టెలికాం పరిశ్రమలో నంబర్-1గా మారింది. ప్రపంచవ్యాప్తంగా జియోకు 49 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం జియోకు 13 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉన్నారు. డేటా వినియోగంలో జియో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ.. 5G సేవల విషయంలో చైనా కంటే వెనుకబడి ఉంది. జియో బాధ్యతలను ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ నిర్వహిస్తున్నారు. రిలయన్స్ జియోను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాడు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications