Reliance: దేశంలో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ దూసుకుపోతోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్ట్ కానుండటంతో స్టాక్ మార్కెట్ వర్గాల్లో తీవ్ర బజ్ ఏర్పడింది. తాజాగా మరో కంపెనీని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అది కూడా ప్రముఖ బాలీవుడ్ నటిది కావడం విశేషం.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో భాగమైన రిలయన్స్ బ్రాండ్స్ మరో కంపెనీని దక్కించుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటి అలియా భట్ కు చెందిన చైల్డ్ వేర్ బ్రాండ్ 'ఎడ్-ఎ-మమ్మా'ను దాదాపు 350 కోట్లు వెచ్చించి దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఈ రెండు కంపెనీల మద్య చర్చలు చివరి దశలో ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. రాబోయే 10 రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే అంబానీ కంపెనీకి పలు లగ్జరీ, హై ప్రీమియం, హై స్ట్రీట్ లైప్ స్టైల్ విభాగాలకు చెందిన ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ తో భాగస్వామ్యం ఉంది. ఈ డీల్ సక్సెస్ అయితే కిడ్స్‌వేర్ పోర్ట్‌ఫోలియో మరింత బలంగా తయారవుతుందని భావిస్తున్నారు.
పిల్లల కోసం సరసమైన ధరలకు మంచి దుస్తులు అందించాలనే లక్ష్యంతో నటి అలియా 2020లో భట్ ఎడ్-ఎ-మమ్మాను ప్రారంభించారు. సొంత వెబ్‌స్టోర్ మాత్రమే కాకుండా FirstCry, AJIO, Myntra, Amazon, Tata CLIQ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎక్కువగా విక్రయాలు జరుపుతోంది.
ఈ బ్రాండ్ 4 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications