Reliance Retail: అంబానీతో జతకట్టిన యూకే ఫ్యాషన్ బ్రాండ్.. డీల్ వివరాలు..
Reliance Retail: అంబానీ నేతృత్వంలో నడుస్తున్న రిలయన్స్ రిటైల్ తన ఫ్యాషన్ వ్యాపారంపై భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అంబానీ కుమార్కె ఇషా బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ విస్తరణ రాకెట్ వేగంతో కొనసాగుతోంది.
ఈ క్రమంలో తాజాగా కష్టాల్లో ఉన్న యూకే ఫ్యాషన్ రిటైలర్ సూపర్‌డ్రీ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌తో జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. సూపర్‌డ్రీ తన మేధో సంపత్తి ఆస్తులను రిలయన్స్ రిటైల్‌కు 48.27 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు రాయిటర్స్ నివేదించింది. ప్రస్తుతం కంపెనీ మెుత్తంగా 18,000 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది. తాజా డీల్ ద్వారా జాయింట్ వెంచర్‌లో సూపర్‌డ్రీ 24%, రిలయన్స్ రిటైల్ 76% వాటాలను కలిగి ఉంటాయని వెల్లడైంది.

తాజా డీల్ ద్వారా రిలయన్స్ రిటైల్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో బ్రాండ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. UK రిటైలర్ సూపర్‌డ్రీ హోల్‌సేల్ భాగస్వాముల నుంచి బలహీనమైన ఆర్డర్ల రాకతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇది కంపెనీ నిధులపై భారీ ప్రభావాన్ని చూపిందని వెల్లడైంది. రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందం కాకుండా, సూపర్‌డ్రీ ఇతర ఒప్పందాలలో ఆగస్ట్‌లో హిల్కో క్యాపిటల్‌తో 25 మిలియన్ యూరోల సెకండరీ లెండింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. అలాగే బాంట్రీ బే క్యాపిటల్‌తో 80 మిలియన్ యూరోల ఒప్పందాన్ని కూడా కలిగి ఉంది.
ఆర్థిక గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్న Superdry ఈ ఏడాది ప్రారంభంలో కూడా షేర్ల విక్రయాల ద్వారా 12 మిలియన్ యూరోలను సేకరించిందని సమాచారం. తాజా జాయింట్ వెంటర్‌కి ముందర అంబానీకి చెందిన రిలయన్ రిటైల్ సెప్టెంబర్ ప్రారంభంలో బాలీవుడ్ నటి అలియా భట్-ప్రమోట్ చేసిన పిల్లలు, ప్రసూతి దుస్తుల బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మలో 51% వాటాతో జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. మెుత్తానికి ఇషా అంబానీ రాకతో రిలయన్స్ రిటైల్ వ్యాపార ముఖ చిత్రం వేగంగా మారిపోతోంది.


Click it and Unblock the Notifications