Mukesh Ambani: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కిట్టీలోకి వరుసగా అనేక కంపెనీలు వచ్చి చేరిపోతున్నాయి. అంబానీ FMCG రంగంలో వేగంగా విస్తరించే క్రమంలో అనేక ప్రముఖ పురాతన బ్రాండ్లను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులోని చెన్నైకి చెందిన 45 ఏళ్ల పురాతన కంపెనీని సైతం ఆయన కొనుగోలు చేయటం గమనార్హం.
ప్రధానంగా రిలయన్స్ రిటైల్ బాధ్యతలు ఇషా అంబానీ చేపట్టిన తర్వాత ఫ్యాషన్ నుంచి ఎఫ్ఎంసీజీ వరకు అనేక రంగాల్లో కొత్త కంపెనీలను వరుసగా డీల్స్ జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్యాంపా కోలా, ఎస్ఐఎల్ తర్వాత రిలయన్స్ రిటైల్ తాజాగా వెల్వెట్ బ్రాండును కొనుగోలు చేశారు. వెల్వెట్ బ్రాండ్ షాంపూ ఉత్పత్తులను తిరిగి మార్కెట్లో పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఈ డీల్ జరిగినట్లు రిలయన్స్ రిటైల్ సీఓఓ కేతన్ మోడీ వెల్లడించారు. దీంతో వెల్వెట్ ఉత్పత్తుల తయారీకి శాశ్వత లైసెన్సును అంబానీ దక్కించుకున్నారని తెలుస్తోంది.

భారతదేశపు ప్రతిష్టాత్మకమైన వారసత్వ బ్రాండ్‌లను పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తు వ్యాపారాలను బలమైన పునాదితో నిర్మించాలనే ఉన్న రిలయన్స్ గ్రూప్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా తాజా డీల్ జరిగింది. వాస్తవానికి వెల్వెట్ బ్రాండ్ మెుదట్లో షాంపూలను మాత్రమే తయారూ చేసేది, అయితే ఆ తర్వాత సబ్బులతో పాటు ఇతర ఉత్పత్తులకు విస్తరించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ ప్రస్తుతం వెల్వెట్ ఉత్పత్తులను తమిళనాడులో విడుదల చేయాలని చూస్తోంది. తర్వాత వాటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా విక్రయాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మెుదటగా చిన్న శాచెట్లలో షాంపూలను మార్కెట్లో తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ భావిస్తోంది.
రానున్న కాలంలో కూడా మరిన్ని ప్రఖ్యాత భారతీయ బ్రాండెడ్ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను కంపెనీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయిస్తోంది. అయితే ఈ క్రమంలో రిలయన్స్ రిటైల్ ఎలాంటి కంపెనీలను టార్గెట్ చేయాలని చూస్తోందనే వివరాలను మాత్రం బయటపెట్టడం లేదు. కానీ ప్రఖ్యాత బ్రాండ్లను రిలయన్స్ గొడుగు కిందకు తీసుకురావాలనే నిర్ణయాన్ని అంబానీ ఫ్యామిలీ ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తోంది.
వాస్తవానికి తమిళనాడులో ప్రారంభించబడిన వెల్వెట్ ప్రయాణం 1980లో స్టార్ట్ అయ్యింది. సుజాత బయోటెక్ వ్యవస్థాపకుడు సికె రాజ్‌కుమార్ ఈ కంపెనీని ప్రారంభించారు. తన తండ్రి నుంచి పొందిన ప్రేరణతో షాంపూ ఉత్పత్తులను ప్రారంభించారు. 1980ల ప్రారంభంలో వెల్వెట్ వోల్టాస్‌తో మార్కెటింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. రాజ్ కుమార్ తరువాత గోద్రేజ్ గ్రూప్‌తో మార్కెటింగ్, పంపిణీ కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో చేపట్టిన ఈ నిర్ణయాలు వెల్వెట్‌ను కేవలం ఒక ప్రాంతీయ బ్రాండ్ స్థాయి నుంచి జాతీయంగా గుర్తింపు తెచ్చుకునేందుకు దారితీసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications