Reliance Retail: డబ్బుకోసం వారితో రిలయన్స్ చర్చలు.. పూర్తి వివరాలు..
Reliance Retail: గత కొంత కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద పనిచేసే రిలయన్స్ రిటైల్ అనేక వ్యాపారాల్లోకి దూకుడుగా ప్రవేశించింది. అనేక కొత్త బ్రాండ్లను, కంపెనీలను కొనుగోలు చేసింది.
ఈ క్రమంలో కంపెనీపై రుణ భారం 75 శాతం గతంలో కంటే పెరిగిందని ఇటీవల వెల్లడైంది. వాటాల విక్రయం ద్వారా నిధులను సమీకరించాలని అంబానీ భావించారు. ఈ క్రమంలోనే ప్రఖ్యాత పెట్టుబడి సంస్థ KKR రిలయన్స్ రిటైల్ వెంటర్స్‌లో తన వాటాలను పెంచుకుంటూ ఏకంగా రూ.2,069.50 పెట్టుబడిగా పెట్టింది. ఇది కంపెనీ పెట్టుబడి అవసరాలను తీర్చనుంది.
ఇదే క్రమంలో తాజా మరిన్ని విదేశీ పెట్టుబడుల ద్వారా డబ్బును సమీకరించాలని అంబానీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయిటర్స్ తాజా కథనం ప్రకారం రిలయన్స్ రిటైల్ ప్రస్తుత విదేశీ పెట్టుబడిదారులతో పాటు సింగపూర్, అబుదాబి, సౌదీ అరేబియా సావరిన్ ఫండ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడైంది. వీటి నుంచి తాజా పెట్టుబడుల రూపంలో 1.5 బిలియన్ డాలర్లను సమీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రిలయన్స్ రిటైల్‌లో 100 బిలియన్ డాలర్ల విలువతో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ 500 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని చూస్తున్నాయని తెలిసింది. రిలయన్స్ తన రిటైల్ యూనిట్‌లో 10.09% వాటాను 2020లో విక్రయించింది. దీని విలువ రూ.4.68 ట్రిలియన్ అంటే దాదాపు 56.4 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీ వాటాల విక్రయ మార్గం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. గతంలో సైతం కంపెనీ ఇదే పద్ధతిని పాటించింది.


Click it and Unblock the Notifications