Reliance Jio: 5జీ విస్తరణకు అంబానీ ప్లాన్ ఇదే.. ఎయిర్‌టెల్‌కు ఇక చుక్కలే..!!
Reliance Jio: భారతీయ టెలికాం రంగం శరవేగంగా విస్తరణ జరుగుతోంది. ఈ క్రమంలో 5జీ సేవలను అత్యంత వేగంగా రోల్‌అవుట్ కోసం దిగ్గజ కంపెనీలు పావులు కదుపుతున్నాయి.
ఈ క్రమంలో రిలయన్స్ జియో 5G రోల్‌అవుట్ కోసం పరికరాలకు ఆర్థిక సహాయం చేయడానికి స్వీడిష్ ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ నుంచి 2.2 బిలియన్ డాలర్ల ఫండ్ మద్దతును పొందింది. వేగంగా 5జీ నెట్‌వర్క్ విస్తరణకు స్వీడిష్ సంస్థ ఎరిక్సన్, నోకియా నుంచి టెలికాం గేర్‌లను ఎక్కువగా సేకరించింది. క్రెడిట్ ఏజెన్సీ నుంచి సేకరిస్తున్న మెుత్తాన్ని RJIL పాన్-ఇండియా 5G రోల్ అవుట్‌కు సంబంధించి పరికరాలు, సేవలకు ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగించబడుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదికలో తెలిపింది.

ప్రధాన భౌగోళిక ప్రాంతాలలో టెలికాం గేర్ షిప్‌మెంట్‌లో క్షీణత ఉన్నప్పటికీ, రిలయన్స్ జియో నేతృత్వంలో దేశీయంగా 5G రోల్‌అవుట్ ఎరిక్సన్ అండ్ నోకియా వ్యాపారంలో తగ్గుదలను భర్తీ చేయగలిగింది. ఎరిక్సన్ జూన్ 2023 త్రైమాసికంలో "సౌత్ ఈస్ట్ ఆసియా, ఓషియానియా, ఇండియా"లో దాదాపు రూ.10,700 కోట్ల నికర అమ్మకాల్లో 74 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో దాదాపు 90 శాతం వ్యాపారం ఇండియా నుంచి పొందినదే. ఇదే క్రమంలో నోకియా జూన్ త్రైమాసికంలో 333 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.9,500 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్ జియో ఇప్పుడు దాదాపు 6.2 లక్షల గ్రామీణ గ్రామాల్లో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. 2,300 నగరాలు,పట్టణాలకు 5G కవరేజీని విస్తరించింది. దేశవ్యాప్తంగా రూపొందించిన మొత్తం 5G బేస్ స్టేషన్‌లో 80 శాతం వాటాతో.. సెకనుకు సగటున 300 మెగాబిట్ డౌన్‌లోడ్ వేగంతో 5G సేవలను అందిస్తున్నట్లు జియో తెలిపింది. 5G నెట్‌వర్క్‌ల కోసం కంపెనీ తన సొంత స్వదేశీ సాంకేతికతను కూడా అభివృద్ధి చేసింది. జియో సాంకేతిక నిపుణులు 123 పేటెంట్ల కోసం దాఖలు చేయగా.. 41 మంజూరు చేయబడ్డాయి. మార్చి 31, 2023 వరకు మంజూరు చేయబడిన మొత్తం పేటెంట్ల సంఖ్య 177కి చేరుకుంది.


Click it and Unblock the Notifications