Mukesh Ambani: కొన్నాళ్ల కిందటి వరకు ప్రధానంగా పెట్రో కెమికల్స్, రిటైల్ వ్యాపారాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన ముఖేష్ అంబానీ.. వారసుల రాకతో కొత్త రంగాల్లోకి విస్తరిస్తున్నారు. కంపెనీని కొత్త వర్టికల్స్ వైపు నడిపిస్తున్నారు.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో భారీ డీల్ ప్రకటించింది. రిలయన్స్ గ్రూప్ దేశంలో డేటా సెంటర్లను అభివృద్ధి చేయడానికి బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్ రియాల్టీలో పెట్టుబడిని ప్రకటించింది. భారతదేశానికి చెందిన బ్రూక్‌ఫీల్డ్ అండ్ డిజిటల్ రియాల్టీ కంపెనీల్లో 33.33 శాతం వాటాను రిలయన్స్ కొనుగోలు చేస్తోంది. అవసరాన్ని బట్టి తర్వాతి కాలంలో పెట్టుబడి మెుత్తాన్ని రూ.622 కోట్ల వరకు పెంచొచ్చని తెలుస్తోంది.

డిజిటల్ రియాల్టీ ట్రస్ట్, బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉమ్మడి వ్యాపారం భారతదేశంలోని డిజిటల్ సేవల కంపెనీలకు కీలకమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఇది అధిక-నాణ్యత, అధిక-కనెక్ట్ మరియు ఆన్-డిమాండ్ స్కేలబుల్ డేటా సెంటర్‌లను అమలు చేస్తుంది. తాజా ఒప్పందం తర్వాత ఉమ్మడి వ్యాపారంలో రిలయన్స్ సమాన భాగస్వామి అవనుంది. కొత్త జాయింట్ వెంచర్ 'డిజిటల్ కనెక్షన్: ఎ బ్రూక్‌ఫీల్డ్, జియో అండ్ డిజిటల్ రియాల్టీ కంపెనీ'గా రీబ్రాండ్ చేయబడుతోంది.
జాయింట్ వెంచర్ ప్రస్తుతం దేశంలో చెన్నై, ముంబైలలో డేటా సెంటర్లను అభివృద్ధి చేస్తోంది. చెన్నైలోని 100 మెగావాట్ల కాంప్లెక్స్‌లో మొదటి 20 మెగావాట్ల(MW) గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ (MAA10) 2023 చివరి నాటికి పూర్తవుతుందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. 40 మెగావాట్ల డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముంబైలో 2.15 ఎకరాల భూమిని సేకరించినట్లు ఇటీవలే ప్రకటించింది. తాజా పెట్టుబడి డిజిటల్ పరివర్తన, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, ప్లగ్ అండ్ ప్లే సొల్యూషన్‌లను అందించడంలో దోహదపడుతుందని జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్ CEO కిరణ్ థామస్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications