Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఆర్‌బీఐ ప్రత్యేక అనుమతి.. పూర్తి వివరాలు
Mukesh Ambani: దేశంలోని ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిధుల విషయంలో ప్రత్యేక ఆమోదాన్ని పొందింది.
రిజర్వు బ్యాంక్ నుంచి పొందిన అనుమతి ప్రకారం గత సంవత్సరం వ్యాపార విస్తరణ కోసం సేకరించిన 3 బిలియన్ డాలర్ల కంటే అదనంగా 2 బిలియన్ డాలర్ల నిధులను రిలయన్స్ గ్రూప్ కలిగి ఉండేందుకు అనుమతి లభించింది. నిర్థేశించిన పరిమితుల కంటే ఎక్కువ మెుత్తాన్ని నిలుపుకునేందుకు రిలయన్స్ గ్రూప్ భారతీయ రిజర్వు బ్యాంకును ఆశ్రయించటంతో తాజా పరిణామం చోటుచేసుకుంది.

ఈ డబ్బును రిలయన్స్ ఇండస్ట్రీస్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, న్యూ ఎనర్జీ, టెలికాం వ్యాపారాలను విస్తరించడానికి ఉపయోగించాలని చూస్తోంది. కంపెనీకి బలమైన క్రెడిట్ రేటింగ్ తో పాటు నగదు ప్రవాహాలు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు మార్చిలో తిరిగి రుణ ప్రక్రియలో పాల్గొనాలని కోరుకున్నాయి. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకింగ్ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడైంది. కాబట్టి కంపెనీ అవసరమైన దానికంటే ఎక్కువ మెుత్తంలో నిధులను నిలుపుకోవాలని నిర్ణయించుకుంది.

అయితే ఇలాంటి పెంపునకు రిజర్వు బ్యాంక్ అనుమతులు ఇవ్వటం ఇదే మెుదటిసారి కాదని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఈ నెల ప్రారంభంలో అనుమతులు వచ్చాయి. చట్ట ప్రకారం ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్‌ల (ECB)పై RBI నిబంధనల కింద ఒక వ్యక్తి లేదా కంపెనీ ఆర్థిక సంవత్సరానికి 750 మిలియన్ డాలర్ల వరకు నిధులను పొందవచ్చు. ఈ పరిమితికి మించి విదేశాల్లో డబ్బును సేకరించేందుకు కంపెనీలు సెంట్రల్ బ్యాంక్(RBI) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications