Reliance Industries: దేశంలోని సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజునే కొత్త వ్యాపారాన్ని కొనుగోలుచేసింది.
ఈ క్రమంలో అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాన్సర్‌కు ప్రత్యేకత కలిగిన టెక్నాలజీ ఆధారిత హెల్త్‌కేర్ కంపెనీ కర్కినోస్‌ను కొనుగోలు చేసి కొత్త రికార్డును నమోదు చేసింది. ఇటీవలి కాలంలో రిలయన్స్ హెల్త్ కేర్ రంగంలో వేగంగా తన వ్యాపారాన్ని విస్తరించటం గమనార్హం. దీనికి ముందు సైతం అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఇదే రంగంలో వివిధ కొత్త పెట్టుబడులు, కొనుగోళ్లను చేపట్టిన సంగతి తెలిసిందే. డైరెక్ట్ హెల్త్‌కేర్, ఫార్మా కంపెనీలను కూడా కలిగి ఉన్న సంగతి తెలిసిందే.

డిసెంబర్ 27, 2024న దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇచ్చిన సమాచారం ప్రకారం కంపెనీ తన అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ ద్వారా కర్కినోస్ హెల్త్‌కేర్‌ను కొనుగోలు వివరాలను వెల్లడించింది. ఒక్కో షేరుకు రూ.10 చొప్పున దాదాపు కోటి షేర్లను ముఖేష్ అంబానీ సొంతం చేసుకున్నట్లు ఇందులో వెల్లడించబడింది. అలాగే రిలయన్స్ కంపెనీకి చెందిన డిబెంచర్లను సైతం కొనుగోలు చేసింది. ప్రస్తుతం అంబానీ తాజా డీల్ ద్వారా కార్కినోస్ కొనుగోలు చేసేందుకు రూ.375 కోట్లను వెచ్చించినట్లు వెల్లడైంది.
కార్కినోస్ ఆంకాలజీ సేవలను (టెస్టింగ్, రేడియేషన్ థెరపీ, మొదలైనవి) అందించడానికి ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని ప్రారంభించింది. కంపెనీ డిసెంబర్ 2023 వరకు దాదాపు 60 ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇది అనుబంధ సంస్థ ద్వారా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో 150 పడకల మల్టీస్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ముందుకు వెళుతున్నప్పుడు, అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ డయాగ్నోస్టిక్స్ అండ్ రీసెర్చ్, డిస్ట్రిబ్యూటెడ్ క్యాన్సర్ కేర్ నెట్‌వర్క్, క్యాన్సర్‌ను ముందస్తుగా నిర్ధారించడానికి కార్పొరేట్‌లతో టై-అప్‌లు, క్యాన్సర్ కేర్ హాస్పిటల్‌ల ద్వారా ప్రధాన ఆదాయ వనరును కలిగి ఉంది.
వాస్తవానికి కార్కినోస్ హెల్త్‌కేర్ సంస్థ జూలై 2020లో స్థాపించబడింది. ఈ కంపెనీ ప్రధానంగా క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించటంతో పాటు రోగనిర్ధారణ, చికిత్స నిర్వహణ కోసం నూతన సాంకేతికతో ముందుకు సాగుతూ అగ్రగామిగా నిలిచింది. ఈ క్రమంలో కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.22 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications