Sil Foods: భారతీయ వ్యాపారవేత్త, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ముఖేష్ అంబానీ తన వ్యాపారాలను విస్తరించటానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రిలయన్స్ కన్జూమర్ తన ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఇండిపెండెన్స్ విస్తరణ కోసం మరికొన్ని కంపెనీలను కొనుగోలు చేస్తోంది.
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ జామ్‌లు, సాస్‌లు, మయోన్నైస్, క్యాన్డ్ ఫుడ్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులను కలిగి ఉన్న సిల్ ఫుడ్స్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. తాజా కొనుగోలు రిలయన్స్ కన్జూమర్ దృఢమైన పునాదితో వ్యాపారాన్ని నిర్మించడంలో ఒక ముఖ్యమైన మైలురాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ FMCG విభాగం పేర్కొంది. సిల్ బ్రాండ్ దాని ఉత్పత్తుల శ్రేణిని జోడించడం వలన రిలయన్స్ కన్స్యూమర్ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోకు కొత్త ఉత్పత్తులు జోడించబడతాయని తెలుస్తోంది.

అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో ఇప్పటికే గుర్తింపు పొందిన ఐకానిక్ బ్రాండ్‌లను కొనుగోలు చేయడం, పునరుజ్జీవింపజేయడం దాని నిరంతర వ్యూహంలో భాగంగా ఉంది. కంపెనీ రూ.10,000 కోట్ల ఆదాయ మార్కును సాధించే లక్ష్యంలో భాగంగా వ్యూహాత్మకంగా బ్రాండ్ల కొనుగోళ్లను చేపడుతోందని తెలుస్తోంది. కంపెనీ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కాంపా, ఇండిపెండెన్స్ ఉత్పత్తుల కారణంగా తొమ్మిది నెలల కాలంలో రూ.8,000 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు బ్రాండ్లు వ్యక్తిగతంగా రూ.1000 కోట్ల టర్నోవర్ చూశాయి.
సిల్ ఫుడ్స్ బ్రాండ్లకు కొత్త జీవం పోయాలని రిలయన్స్ కన్స్యూమర్ భావిస్తోందని సీఓఓ కేతన్ మోదీ పేర్కొన్నారు. కంపెనీకి ఇప్పటి వరకు వనియోగదారులతో ఉన్న అనుభవం, పంపిణీ వ్యవస్థ, ఆవిష్కరణ వంటి నైపుణ్యాలు బ్రాండ్ పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో సందర్భానుగుణంగా వీటిని ప్రవేశపెట్టనున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు. రిలయన్స్ తనకు దేశవ్యాప్తంగా ఉన్న బలమైన ఉనికి నుంచి సిల్ ఫుడ్స్ ప్రయోజనం పొందుతుందని కంపెనీ భావిస్తోంది.
మెరుగైన నాణ్యత ప్రమాణాలు, విస్తృత పంపిణీ నెట్‌వర్క్, ప్రభావవంతమైన మార్కెటింగ్ ప్రచారాల ద్వారా సిల్ ఫుడ్స్ ఉత్పత్తి సమర్పణలను మెరుగుపరచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. రిలయన్స్ ఇప్పటికే తన ఇండిపెండెన్స్ బ్రాండ్ ద్వారా దేశీయ మార్కెట్లలో అనేక పప్పు దినుసులు, ధాన్యాలు సహా అనేక ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తోంది. వీటిని రిలయన్స్ రిటైల్ స్టోర్లతో పాటు కంపెనీ కొత్తగా కొనుగోలు చేసిన మెట్రో స్టోర్లలో విస్తృతంగా మార్కెటింగ్ చేస్తోంది. తాజా కొనుగోళ్లు ఎఫ్ఎంసీజీ రంగంలో ఇతర ఆటగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. సేల్స్ కోసం అంబానీ ధరల పోటీకి దిగుతారని ఆందోళన చెందుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications