JioStar Layoff: దేశంలోని మీడియా వ్యాపారంలో కూడా రిలయన్స్ అండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు కేవలం ఆయిల్, రిటైల్ వంటి రంగాలకు పరిమితమైన అంబానీ ప్రస్తుతం అనేక కేటగిరీల్లోకి తన బిజినెస్ విస్తరింపజేశారు.
ఇక వివరాల్లోకి వెళితే చాలా కాలం నుంచి జియో ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ అయిన హాట్ స్టార్ వ్యాపారాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా ఎప్పటిలాగానే అంబానీ తన వ్యాపార ప్రత్యర్థిని ఉచితాలతో ఉక్కిరిబిక్కిరి చేసి లాభాలు లేని వ్యాపారం చేయటం ఎందుకులే అమ్మేసుకుందాం అనే స్థాయికి తీసుకొచ్చారు. దీంతో అంబానీకి చెందిన మీడియా సంస్థ వయాకామ్ 18 వాల్ట్ డిస్నీకి చెందిన డిస్నీ హాట్ స్టార్ మధ్య కొనుగోలు చర్చలు జరగటం దానికి కాంపిటీటివ్ కమిషన్ నుంచి అనుమతులు రావటం గడచిన కొన్ని నెలల్లో చకచకా జరిగిపోయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రెండు సంస్థలు ఏకం కావటంతో ఉద్యోగులపై ఆ ప్రభావం పడింది. అవును అంబానీ సంస్థ జియోస్టార్ ప్రస్తుతం మెర్జర్ తర్వాత ఖర్చుల మదింపులో భాగంగా ఉద్యోగుల కోతలను మెుదలుపెట్టేసింది. ఈ తొలగింపుల జూన్ 2025 వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనివల్ల దాదాపు 1100 మంది ఉద్యోగులు ప్రభావితం అవుతారని అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇక్కడ రెండింటిలోనూ ఒకే పాత్రలో పనిచేస్తున్న వ్యక్తులు ప్రస్తుత కోతల్లో ఎక్కువగా ప్రభావితం అవుతారని తెలుస్తోంది.
అయితే ఉద్యోగుల తొలగింపు వ్యవహారం గడచిన నెల రోజులుగా అంతర్గతంగా ప్రారంభమైందని సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఉద్యోగాల కోతలు ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ విభాగాలలోని కార్పొరేట్ స్థానాలను ప్రభావితం చేస్తాయని అంతర్గత వ్యక్తుల నుంచి అందిన సమాచారం ప్రకారం వెల్లడైంది. వాస్తవానికి వయాకామ్18, డిస్నీకి చెందిన స్టార్ ఇండియా విలీనమై భారతదేశపు అతిపెద్ద మీడియా, వినోద సంస్థ జియోస్టార్ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే కొత్త సంస్థ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో కంపెనీ ప్రధానంగా స్పోర్ట్స్, ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జియోస్టార్ ప్రభావితమైన ఉద్యోగులకు లేఆఫ్ ప్యాకేజీని అందిస్తున్నట్లు సమాచారం. నోటీసు పొందిన ఉద్యోగులు కంపెనీలో ఎంతకాలం పనిచేశారనే దానిపై ఆధారపడి 6-12 నెలల జీతం పొందనున్నట్లు సమాచారం. కంపెనీలో పనిచేసిన ప్రతి పూర్తి సంవత్సరానికి ఒక నెల వేతనంతో పాటు సదరు ఉద్యోగికి 1-3 నెలల నోటీసు కాలాన్ని అందిస్తోంది. సుమారు 70 వేల కోట్ల విలువ కలిగిన జియోస్టార్ సంస్థ ప్రపంచ దిగ్గజాలైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలతో పోటీపడాలని తహతహలాడుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications