Mukesh Ambani: పండక్కి అంబానీ శత్రుసంహార వ్యూహం.. ఆందోళనలో అగ్ర కంపెనీలు..!!
Jio Financial: ముఖేష్ అంబానీ తన బలాన్ని నిరూపించుకునేందుకు పండుగ సమయాన్ని ఏరికోరి ఎంచుకున్నారు. వేల కోట్ల వ్యాపారాన్ని లాగేసేందుకు పెద్ద ప్లాన్ వేశారు. ప్రజల సెంటిమెంట్లను క్యాష్ చేసుకునే పనిలో ముఖేష్ అంబానీ సంస్థ ముందుకొచ్చింది.
ఇటీవల అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రత్యేక కంపెనీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది కస్టమర్లకు కన్జూమర్ డ్యూరబుల్స్ అంటే ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్రయన్సెస్ వంటి కొనుగోళ్లకు అప్పులిస్తామంటూ పండుగ సీజన్ భారీ వ్యాపారానికి తెరలేపింది. దేశవ్యాప్తంగా రిలయన్స్ గ్రూప్ కు చెందిన 300 స్టోర్లలో వాయిదాల్లో వస్తువులను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు కంపెనీ వీలు కల్పిస్తోంది. డబ్బుల్లేకుండా రండి వస్తువులతో వెళ్లండి అంటూ కస్టమర్లకు రెడ్ కార్పెట్ పరచటం ఇతర ఫైనాన్స్ సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

జియో ఫైనాన్షియల్స్ ఫర్నిచర్ నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు అన్ని రకాల వస్తువుల కొనుగోలుపై జీరో డౌన్ పేమెంట్, ఫోర్ క్లోజర్ ఛార్జీలు లేకుండానే రుణాలను అందిస్తోంది. మధ్య తక్కువ అదాయ వర్గాలకు చెందిన ప్రజలు పండక్కి కొత్త వస్తువులను కొనుక్కోవాలనే కలను ఇది నిజం చేస్తోంది. ఎలాంటి డాక్యుమెంట్లు, బ్యాంకుతో సంబంధం లేకుండా రూ.30,000 వరకు ఫైనాన్స్ సౌలభ్యం అందుబాటులో ఉంది. కేవలం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మెుబైల్ నంబర్ వంటి వివరాలు సమర్పించి లోన్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు.
మెుత్తానికి అంబానీ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా తన టెలికాం సేవల విస్తరణలో పాటించిన ప్లాన్ వినియోగించి కంపెనీ వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతం దేశంలో ఆటో ఫైనాన్సింగ్, హోమ్ లోన్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం అంబానీ దూకుడుతో ఫైనాన్స్ వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతున్న బజాజ్ ఫైనాన్స్ భారీగా ఒత్తిడికి లోనవుతోంది. రానున్న కాలంలో అంబానీ కంపెనీ దీనికి గట్టి పోటీదారుగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications