RIL Q2 Results: అదరగొట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలు.. జియో, రిటైల్ ఆన్ ట్రాక్..
RIL Q2 Results: దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్వహిస్తున్న రిలయన్స్ గ్రూప్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ చమురు, గ్యాస్ వ్యాపారం మంచి పనితీరును కనబరిచింది.
దీంతో కంపెనీ రెండవ త్రైమాసిక కన్సాలిడేటెడ్ లాభం రూ.17,394 కోట్లుగా నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ప్రకటించిన రూ.13,656 కోట్ల లాభం కంటే ఇది 27 శాతం అధికం. ఈ క్రమంలో ఆయిల్ నుంచి టెలికాం వ్యాపారాలను విస్తరించిన రిలయన్స్ గ్రూప్ ఏకీకృత ఆదాయం క్యూ2లో గత ఏడాది కంటే 1 శాతం పెరిగి రూ.2.34 లక్షల కోట్లుగా నిలిచింది.

ఇంధన మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ.. ఇంధన డిమాండ్‌లో బలమైన వృద్ధికి దారితీసింది. అలాగే కంపెనీ చమురు, గ్యాస్ వ్యాపారం వృద్ధి ముఖ్యంగా గమనించదగినదని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో KGD6 బ్లాక్ నుంచి ఉత్పత్తి పెరగడం, భారత ఆర్థిక వ్యవస్థకు ఇంధన పరివర్తనకు విలువైన ఇంధనాన్ని అందించడం కీలక అంశాలుగా ఉన్నాయన్నారు. రిలయన్స్ ఆయిల్ & గ్యాస్ సెగ్మెంట్ త్రైమాసిక ఆదాయాలు 71.8% పెరిగి రూ.6,620 కోట్లకు చేరుకున్నాయి.
రిలయన్స్ జియో..
ఇక అంబానీ టెలికాం వెంచర్ జియో ఫలితాలను విశ్లేషిస్తే.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అధిక ఖర్చులు, టారిఫ్ పెంపుదల లేకపోవడం వల్ల నికర లాభంలో కేవలం 4% పెరుగుదలను నమోదు చేసింది. దీంతో సెప్టెంబర్ త్రైమాసికంలో జియో నికర లాభం రూ.5,058 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో ఆదాయం 3 శాతం వృద్ధి చెంది రూ.రూ.24,750 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో జియో ARPU అంటే ఒక్కో వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.181.7కి పెరిగింది. ఈ క్రమంలోనే కంపెనీ జియో ఎయిర్ ఫైబర్ లాంచ్ తర్వాత నిన్న తన ఇంటర్నెట్ ఆధారిత సేవలను ప్రదర్శించింది.
రిలయన్స్ రిటైల్..
ఇషా అంబానీ నేతృత్వంలో వేగంగా వృద్ధి చెందుతున్న రిలయన్స్ రిటైల్ సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి పనితీరును కనబరించింది. క్యూ2లో కంపెనీ నికర లాభం 21 శాతం పెరిగి రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 19.5% పెరిగి రూ.68,937 కోట్లకు చేరుకుంది. త్రైమాసికంలో అద్భుతమైన పనితీరును అందించామని, ఆర్థిక గణాంకాల్లో ఆల్ టైమ్ హైని సాధించామని ఇషా ప్రకటించారు. రిలయన్స్ రిటైల్ తన ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఉనికిని వేగంగా విస్తరింపజేస్తూనే ఫ్యాషన్ లవర్లను ఆకట్టుకునే ఉత్పత్తులను, ఆఫర్లను జోడిస్తుందని ముఖేష్ అంబానీ అన్నారు.


Click it and Unblock the Notifications