ఏం చేసుకుంటారు మామా అంత డబ్బు.. దేశంలో సగం సంపద ఈ ముగ్గురి దగ్గరే.. వన్ వెల్త్ నివేదికలో షాకింగ్ విషయాలు..

Ambani Trio Tops India's Wealth Creator List: తింటే గారెలే తినాలి..పుడితే అంబానీలా పుట్టాలి అనే కొత్త సామెతను చెప్పుకునే సమయం వచ్చింది. ఎందుకంటే దేశంలో అత్యంత ధనవంతులుగా అంబానీ కుటుంబం నిలిచింది. అంబానీ కుమారులు ఆకాష్, అనంత్ అంబానీలు ఒక్కొక్కరు రూ. 3.6 లక్షల కోట్ల నికర విలువతో భారతదేశంలో అత్యంత ధనవంతులుగా నిలిచారు. క్రిసిల్ సహకారంతో దేశంలోని వివిధ రంగాల్లో సేవలిందిస్తున్న అత్యంత సంపన్నుల జాబితాను 360 వన్ వెల్త్ తయారు చేసింది. ఈ జాబితాలో అంబానీ కుటుంబమే అగ్రస్థానంలో నిలిచింది మన దేశంలో..

ఈ నివేదికలో 2,013 మంది భారతీయ సంపద సృష్టికర్తల గురించి వివరించారు.. వీరి మొత్తం నికర విలువ సుమారు రూ.100 ట్రిలియన్లుగా ఉంది, ఇది దేశ GDPలో దాదాపు మూడో వంతుగా మనం చెప్పుకోవచ్చు. ఈ నివేదిక కనీసం రూ.5 బిలియన్ల నికర విలువ కలిగిన ధనవంతులను పరిగణలోకి తీసుకుంది. వీరిలో వ్యవస్థాపకులు, నిపుణులు, పెట్టుబడిదారులు, టాప్ కంపెనీల వారసులు ఉన్నారు. వీరి సగటు నికర విలువ రూ.14.2 బిలియన్లు. ట్రాక్ చేయబడిన సంపదలో భారతదేశంలోని టాప్ 50 వ్యాపార సంస్థలు 59% వాటా కలిగి ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మాత్రమే 12% నియంత్రణలో ఉన్నాయి.

Akash Ambani net worth Anant Ambani wealth Isha Ambani richest woman Ambani heirs wealth list richest Indians 2025 India billionaire list Ambani family fortune Indian business tycoons India wealth report top Indian wealth creators 2025 10

ఈ అధ్యయనం ప్రకారం.. సమగ్ర జాబితాలో కనీసం రూ.500 కోట్ల నికర విలువ కలిగిన 2,013 మంది ధనవంతులు ఉన్నారు. వీరి సంపద దాదాపు రూ.100 లక్షల కోట్లుగా ఉందని వెల్త్ నివేదిక తెలిపింది. దేశంలో 161 మంది వ్యక్తులు రూ.10,000 కోట్లకు మించి ఆస్తులను కలిగి ఉండగా.. 169 మంది వ్యక్తులు రూ.5,000-రూ.10,000 కోట్ల మధ్య సంపద కలిగి ఉన్నారని ఈ తాజా అధ్యయనం తెలిపింది.

దేశంలోని తిరుగులేని ఆర్థిక కేంద్రంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై అవతరించింది. ముంబైలో దేశంలోనే మొత్తం సంపదలో 40% వాటాను కలిగి ఉంది. ఆర్థిక రాజధానిలో 577 మంది సంపద సృష్టికర్తలు ఉన్నారు. ముంబై తర్వాత న్యూఢిల్లీ, బెంగళూరు వరుసగా 17%, 8% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇక అహ్మదాబాద్ 5% వాటాతో తరువాతి స్థానంలో నిలిచింది.

భారతదేశంలో 40 ఏళ్లలోపు వయసున్న వారిలో 143 మంది అత్యంత ధనవంతులుగా నిలిచారు. భారత్‌పేకి చెందిన శాశ్వత్ నక్రాణి 27 ఏళ్ల వయసులో అత్యంత ధనవంతుల జాబితాలో అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ , టాటా గ్రూప్, అదానీ గ్రూప్‌లకు చెందిన కుటుంబాలు, కంపెనీ ప్రమోటర్లు దేశ సంపదలో దాదాపు 24% వాటా కలిగి ఉన్నారు, ఇది రూ. 36 లక్షల కోట్లుగా అంచనా వేసింది అధ్యయనం.

వెల్త్ నివేదిక ప్రకారం.. బ్యాంకింగ్, టెలికాం, విమానయాన రంగాలు సగటు వ్యక్తిగత సంపదలో అగ్రస్థానంలో ఉన్నాయి, ఇవి రూ. 7,900 కోట్ల నుండి రూ. 8,500 కోట్ల వరకు ఉన్నాయి. సంపన్న వ్యక్తుల సంఖ్యలో ఫార్మాస్యూటికల్స్ ముందంజలో ఉంది. దీని తరువాత ఆర్థిక పరమై సేవలు, ఐటీ రంగం ఉన్నాయి. భారతదేశ సంపదలో మహిళలు 24% అత్యంత సంపదను కలిగి ఉన్నారు. ఫార్మాలో దాదాపు 33%, ఆర్థిక సేవలలో దాదాపు 24% బలమైన ప్రాతినిధ్యం వహిస్తున్నారు మహిళలు. ఈ జాబితాలో ఇషా అంబానీ అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచింది. వ్యాపారాలను స్థాపించిన లేదా రాబడిని పెంచడంలో కీలక పాత్ర పోషించిన 72 మంది మహిళా నాయకులను కూడా ఈ నివేదిక గుర్తించింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 93% సంపద పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీలకు సంబంధించినది. మిగిలిన 7% అన్‌లిస్టెడ్ సంస్థల నుండి తీసుకున్నారు అధ్యయనకారులు. అదనంగా, రూ. 50 ట్రిలియన్లు ప్రమోటర్ ట్రస్టులు, నియంత్రిత సంస్థలలో ఉన్నాయి. సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ కలిసి రూ. 8.2 ట్రిలియన్లను కలిగి ఉన్నాయి.సంపద సృష్టికర్తలలో 62% మంది ఇప్పటికీ తమ వ్యాపారాలలో చురుకుగా నిమగ్నమై ఉన్నారని, దాదాపు 40% మంది కంపెనీ నుంచి నిష్క్రమించినా సంపద హోల్డర్లుగా ఉన్నారని నివేదిక హైలైట్ చేసింది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+