For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 లక్షల రిలయన్స్ షేర్లు తనఖా పెట్టిన ముఖేష్ అంబానీ సన్నిహితుడు

|

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితులు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ రిలయన్స్‌లో తనకు ఉన్న షేర్లలో దాదాపు 93.75 శాతం వాటాను తనఖా పెట్టారని వార్తలు వస్తున్నాయి. ప్రసాద్ వద్ద 6,40,000 రిలయన్స్ షేర్లు ఉండగా, ఇందులో 6,00,000 షేర్లను తనఖా పెట్టారని తెలుస్తోంది. ప్రసాద్‌తో పాటు ఇతరుల అధికారులు కూడా పెద్ద మొత్తంలో షేర్లు తనఖా పెట్టినట్లుగా తెలుస్తోంది.

అనిల్ అంబానీకి షాక్, ముంబై హెడ్ఆఫీస్ స్వాధీనానికి యస్ బ్యాంకు నోటీసులుఅనిల్ అంబానీకి షాక్, ముంబై హెడ్ఆఫీస్ స్వాధీనానికి యస్ బ్యాంకు నోటీసులు

గతంలో షేర్ల విక్రయం

గతంలో షేర్ల విక్రయం

ప్రసాద్ తనకు చెందిన షేర్లను 29 జూన్ 2020లో తనఖా పెట్టారు. వీటి విలువ రూ.103 కోట్లుగా తెలుస్తోంది. 6,40,000 షేర్లలో ఆరు లక్షలు తనఖా పెట్టగా, ప్రస్తుతం అతని వద్ద 40,000 షేర్లు ఉన్నాయి. షేర్ల తనఖాకు ముందు ప్రసాద్ చివరిసారి 2017 సెప్టెంబర్‌లో ట్రేడింగ్ చేశారు. ఆ సమయంలో 1,36,666 షేర్లు విక్రయించారు. ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ లేదా ఫండ్ లేదా ఇతర వెంచర్లకు లేదా అక్వైజేషన్ కోసం నిధులు అవసరమైన సమయంలో తనఖా పెట్టారని తెలుస్తోంది.

35 ఏళ్లుగా ముఖేష్ ఏ-టీంలో..

35 ఏళ్లుగా ముఖేష్ ఏ-టీంలో..

ప్రసాద్ గత 35 ఏళ్లుగా ముఖేష్ అంబానీ ఏ-టీంలో ఉన్నారు. అతను రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఫైబర్, పెట్రోకెమికల్స్, పెట్రోలియం బిజినెస్‌లలో కీలక పదవులు నిర్వర్తించారు. 1980లో రిలయన్స్‌కు చెందిన హజీరా పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను స్ట్రీమ్‌లోకి తీసుకు వచ్చిన ఘనత దక్కింది. రిలయన్స్ కృషన్ గోదావరి అచీవ్‌మెంట్‌లోను ప్రసాద్ పాత్ర ఉంది.

వీరూ తనఖా పెట్టారు

వీరూ తనఖా పెట్టారు

స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం రిలయన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అలోక్ అగర్వాల్ 1.44 మిలియన్ల షేర్లు సెప్టెంబర్ 2019లో తనఖా పెట్టారు. ఇందులో 9,40,000 షేర్లను తీసుకున్నారు. గత నెలలో 2,25,000 షేర్లు తనఖాపెట్టారని వార్తలు వస్తున్నాయి. గత నెలలో రైట్స్ ఇష్యూ ద్వారా 100,000కు పైగా షేర్లను దక్కించుకున్నారని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి నుండి దాదాపు 151 రెట్లు ఎగిసింది.

English summary

6 లక్షల రిలయన్స్ షేర్లు తనఖా పెట్టిన ముఖేష్ అంబానీ సన్నిహితుడు | Ambani's trusted Prasad pledges over 94 percent of his Reliance Industries shares

At a time when investors are eager to buy shares of Reliance Industries, the company's executive director and Mukesh Ambani's loyalist PMS Prasad has pledged nearly 94 per cent of his shareholding in the firm, according to stock exchange filing.
Story first published: Friday, July 31, 2020, 9:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X