Mukesh Ambani: వేసవి కాసుల రేసులో అంబానీ బ్రాండ్.. దూకుడు పెంచిన Reliance Consumer
Campa: ప్రస్తుతం దేశంలో వేసవికాలం ప్రారంభమైంది. ఈ సారి ఎండలు సైతం మండిపోతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రజలను హెచ్చరించింది. ఇది మెుత్తానికి అంబానీకి మాత్రం భారీగా కాసులు కురిపించనుంది

కాంపా కోలా..
దేశీయ బివరేజ్ బ్రాండ్ క్యాంపాకు దేశంలో దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ పురాతన భారత శీలతపానీయాల కంపెనీని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కొనుగోలు చేసింది. దీనిని రిలయన్స్ యాజమాన్యం తిరిగి దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తోంది. మెుదట్లో కాంపా పోర్ట్‌ఫోలియోలో కాంపా కోలా, క్యాంపా లెమన్, కాంపా ఆరెంజ్‌లను పానీయాల విభాగంలో చేర్చనున్నట్లు వెల్లడించింది.

తిరిగి ప్రారంభం..
ఈ బ్రాండ్‌ను ప్రారంభించడం అనేది "సంపన్నమైన వారసత్వం" మాత్రమే కాకుండా "భారతీయ వినియోగదారులతో వారి ప్రత్యేక అభిరుచులు, రుచుల కారణంగా లోతుగా పాతుకుపోయిన సంబంధాన్ని" కలిగి ఉన్న స్వదేశీ భారతీయ బ్రాండ్‌లను ప్రోత్సహించడానికి కంపెనీ వ్యూహానికి అనుగుణంగా ఉంది.

1970లో కింగ్..
ఒకప్పుడు దేశీయ పానీయాల మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన క్యాంపా కోలా బ్రాండ్‌ను పునఃప్రారంభించే ఆలోచనతో రిలయన్స్ రిటైల్ గత ఏడాది ఆగస్టులో కొనుగోలు చేసింది. 1970-80లలో క్యాంపా మార్కెట్‌లో ప్రధాన వాటాను కలిగి ఉంది. అయితే 1990లో అమెరికాకు చెందిన పెప్సీ, కోకాకోలా వంటి ఆటగాళ్లు అరంగేట్రం చేయంతో దేశీయ పానీయాల కంపెనీ పోటీలో నిలవలేక పోయింది. అయితే క్యాంపాను ప్రస్తుతం కొత్తగా లాంచ్ చేయటం ద్వారా మార్కెట్లో ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావాలని రిలయన్స్ యోచిస్తోంది. పాత కాలం జ్ఞాపకాలను తిరిగి పరిచయం చేయాలని రిటైల్ దిగ్గజం ప్లాన్ చేస్తోంది.

ఏపీ, తెలంగాణలో..
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లోకి సరైన సమయంలో కాంపా బ్రాండ్ ను తిరిగి తీసుకురావటం నిజంగా సంతోషంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఇది విస్తరిస్తున్న రిలయన్స్ FMCG వ్యాపారానికి మరో సాహసోపేతమైన ముందడుగని తెలిపారు. గత ఏడాది కంపెనీ Sosyo Hajoori బ్రాండ్ ను కొనుగోలు చేసింది. ఇది ఏపీ, తెలంగాణతో ప్రారంభమై దేశంలో చాలా చోట్ల అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications